Bulli Raju : ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ వచ్చింది. అందులో వెంకటేష్ కొడుకుగా నటించిన బుల్లి రాజు పాత్రకు ఏ రేంజులో రెస్పాన్స్ వచ్చిందో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆ చిన్నారి పేరు రేవంత్ భీమల. అయితే అసలు పేరు కంటే బుల్లి రాజు పేరే బాగా జనాలకు ఎక్కేసింది. చిన్నారి అభినయానికి ఫ్యాన్ కానీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో, డైలాగ్ డెలివరీతో అందరినీ నవ్వించిన ఈ బుడ్డోడి పేరు ఇప్పుడు ఓ రాజకీయ వివాదంలో చిక్కుకుంది.. దానిపై సీరియస్ అయిన బుల్లిరాజు ఫాదర్ సైబర్ క్రైమ్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేం జరిగింది..?
విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. దాని ఎఫెక్ట్ సినిమా పై పడుతుందని ముందు జాగ్రత్తగా చిత్ర యూనిట్ క్షమాపణలు కోరింది. అయిన వివాదాలు మాత్రం ఆగలేదు. అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ యాక్టర్ బుల్లిరాజుకు చుట్టుకుంది. బుల్లిరాజు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో.. అరేయ్… పేటీఎమ్స్!!.. మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. మా లైలా పిన్ని కోసం నేనున్నా. అందుకే నేను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ రా సోను సినిమా బ్లాక్ బస్టర్ పక్కా. లైలా సినిమాకు మద్దతు ఇవ్వండి అంటూ ఒక ట్విటర్ పోస్ట్ వైరల్ అవుతోంది. పేరు బుల్లి రాజు అని ఉండడంతో అందరూ ఆ అకౌంట్ రేవంత్ భీమలదే అనుకున్నారు. అందులో నిజం లేదంటూ ఆ చిన్నారి తండ్రి ఒక పోస్ట్ చేశారు..
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
తమ అబ్బాయి రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ద్వారా ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తమ అబ్బాయి పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ మా అబ్బాయివి కాదు. సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామన్నారు. ఇది తప్ప ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తమకు ఎలాంటి ఇతర అకౌంట్లు, ఛానెల్స్ లేవని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశామన్నారు. దయచేసి తమకు, ముఖ్యంగా తమ అబ్బాయిని ఇటువంటి వివాదాలు రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్లు ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..