BigTV English
Advertisement

SSMB 29: సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందా.? ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.!

SSMB 29: సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఇలా ఉండబోతుందా.? ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.!

SSMB 29: ప్రస్తుతం కొన్ని అప్‌కమింగ్ తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్‌గా ఒక మార్క్ క్రియేట్ చేసేసింది. అందుకే దీనికోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా అదే రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం అందరి చూపు ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’పైనే ఉంది. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రతీరోజూ ఏదో ఒక రూమర్ బయటికొస్తూనే ఉంది. ఆ రూమర్స్ అన్నీ నిజం అయినా.. కాకపోయినా.. అవి ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందులో క్యాస్టింగ్ గురించి, ప్రియాంక చోప్రా క్యారెక్టర్ గురించి మరొక రూమర్ బయటికొచ్చింది.


షూటింగ్ అప్డేట్

‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు దాదాపు సంవత్సరం పాటు పక్కా ప్రీ ప్రొడక్షన్‌ను పూర్తిచేశారు రాజమౌళి. అలా రీసెంట్‌గా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ షూటింగ్ ప్రారంభమవుతుందని అప్డేట్ ఇవ్వడం కోసం రాజమౌళి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మహేశ్ బాబు ఎక్కడికి వెళ్లకుండా లాక్ అయిపోయాడని, తన పాస్‌పోర్ట్ తీసేసుకున్నానని చెప్తూ రాజమౌళి ఒక వీడియో షేర్ చేయగా.. దానికి మహేశ్ కామెంట్ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అని మహేశ్ చేసిన కామెంట్.. తన ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ షూటింగ్‌కు సంబంధించిన మరొక అప్డేట్ బయటికొచ్చింది.


ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్

షూటింగ్ ప్రారంభమయిన వెంటనే తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం ముంబాయ్ వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. దాంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వీకెండ్ నుండి ప్రారంభం కానుందని సమాచారం. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నానా పాటేకర్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గోనున్నారని సమాచారం. కానీ ప్రస్తుతానికి ఇది రూమర్ వరకే పరిమతమయ్యింది. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో మహేశ్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మధ్య కీలక సీన్స్ షూట్ చేయనున్నారట రాజమౌళి. ప్రియాంక కోసం రాజమౌళి (Rajamouli) చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రెడీ చేశారని, ఇందులో కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: చరణ్ అన్ ఫాలో గొడవ.. బన్నీ ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్కరు ఎవరో తెలుసా.. ?

నటీనటులు ఎవరో.?

ఇప్పటివరకు ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ (SSMB 29) గురించి పెద్దగా సమాచారం ఏదీ బయటికి రాలేదు. క్యాస్టింగ్ గురించి, కథ గురించి రూమర్స్ బయటికొస్తున్నాయి కానీ అందులో దేని గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఇందులో మహేశ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుందనే విషయం కన్ఫర్మ్ అయినా ఈ మూవీలో మరొక హీరోయిన్ కూడా ఉండనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీకెండ్‌లో మళ్లీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనే విషయం మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×