BigTV English
Advertisement

Pushpa2 Song : పీలింగ్స్ పాటలో ఇది గమనించారా..? సుక్కు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావ్..

Pushpa2 Song : పీలింగ్స్ పాటలో ఇది గమనించారా..? సుక్కు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావ్..

Pushpa2 Song : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ మూవీ పుష్ప.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా, ఈ సినిమా హిట్ అవ్వడానికి బన్నీ మ్యానరిజం, ఆయన చిత్తూరు యాసలో చెప్పిన పవర్ ఫుల్ డైలాగులతో ఆల్రెడీ పుష్ప గాడు జనాల్లోకి ఎంతగా వెళ్లాడో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడు సైతం భుజాన్ని పైకి ఎత్తి పుష్ప స్టైల్లో డ్యాన్సులు అదర గోడుతున్నారు. పుష్ప 1 కు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో భుజం పైకి ఎత్తడం ఎక్కువగా కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 1లో బన్నీ భుజాన్ని పైకి ఎత్తి నటించాడు. కానీ పుష్ప 2 నుంచి వచ్చిన అప్డేట్స్ ను గమనిస్తే బన్నీ తన భుజాన్ని మామూలుగానే పెట్టినట్లు తెలుస్తుంది. ఇది సినిమా మొత్తానికే తీసేశారా? లేదా మిస్ చేసారా? సుక్కు లాజిక్ మిస్ చేశాడా? అన్నది తెలియలేదు కానీ ఈ మ్యానరిజం సినిమాలో లేదని తెలుస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయిన పీలింగ్స్ సాంగ్ లో అల్లు అర్జున్ నార్మల్ గానే కనిపించాడని పాటను చూస్తే అర్థవుతుంది.


గతంలో వచ్చిన పుష్ప మొదటి పార్ట్‌లోని అన్ని పాటల్లో బన్నీ భుజాన్ని అలానే పైకి ఎత్తి పెట్టాడు. కానీ రెండో పార్ట్‌లోని పాటల్లో మాత్రం ఆ మ్యానరిజం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా పీలింగ్స్ పాటలో అయితే ఆ మ్యానరిజం ఎక్కడా కనిపించలేదు. ఆ పాట కూడా ఏదో హడావిడిగా కానిచ్చేశారు. ఏదో పరుగు పందెం రేసులో ఉన్న బీట్‌లా వెళ్లిపోయింది. ఏది ఎక్కడ అని తెలుసుకోవడం కష్టమే.. బీట్ కు తగ్గట్లు డ్యాన్స్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అది కాస్త ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేసిందని, సాంగ్ ను ఎంజాయ్ చేద్దామనే పీలింగ్స్ ను ఈ పీలింగ్ పాట ఇవ్వలేదనిపిస్తోంది. అసలు పుష్ప 1 రేంజ్ ఆల్బమ్ అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఇవ్వలేకపోయాడు. అందులో అన్ని పాటల్లో లోకల్ ఫ్లేవర్ కనిపించేది. కానీ ఈ రెండో పార్ట్ సాంగ్స్ ఒక్కటి కూడా అంతగా క్లిక్ కావడం లేదు. సూసేకి పాట ఒక్కటి రీల్స్ ప్రపంచాన్ని ఊపేసింది. దెబ్బలు పడతయ్ రో అంటూ శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా అంతగా మెప్పించలేకపోయింది.. ఎదో సినిమాలో పాటలో ఉండాలి కదా అని పెట్టినట్లు ఉన్నాయనే ట్రోల్స్ ను అందుకుంది.

ఇక పుష్ప 2 మూవీకి భారీగానే బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. భారీ ఓపెనింగ్స్ దక్కేలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టికెట్ రేట్లు, అదనపు షోలు ఇచ్చారు. దీంతో టార్గెట్ మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. పుష్ప 2 డే వన్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతోంది. ఇంత వరకు ఏ ఇతర ఇండియన్ సినిమాకు లేని రికార్డుని పుష్ప 2 క్రియేట్ చేయబోతోంది. వెయ్యి కోట్ల టార్గెట్ తో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక భారీ ధరకు   ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2 డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×