NTR Meal: అభిమానులందూ తెలుగు అభిమానులు వేరయ్య అంటే అక్షరాలా నిజమే అని చెప్పాలి. అందుకే మిగతా ఇండస్ట్రీ హీరోలందరూ తెలుగు ప్రేక్షకులకు తలవంచి నమస్కరిస్తారు. ఒక్కసారి ఒక హీరోను ప్రేక్షకులు అభిమానించడం మొదలుపెడితే.. ఆ హీరో కోసం ఏదైనా చేస్తారు.. ఎంతదూరమైనా వెళ్తారు. ఇక హీరోలకున్న ఫ్యాన్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫ్యాన్స్ అంటే సినిమా రిలీజ్ రోజున పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయాలి. తమ హీరోను వేరేవాళ్లు ఒక మాట అంటే.. ట్రోల్స్ చేయాలి.. ఇలాంటివే కాదు. కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఏ హీరో ఫ్యాన్స్ చేయని సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. రా – ఎన్టీఆర్ అనే సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా పేదవారికి ఆకలి తీర్చడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్ మీల్ పేరుతో ఈ సేవా కార్యక్రమం మొదలుకానుంది. రా – ఎన్టీఆర్ అనే సంస్థ చెన్నైలో మొదలైంది. సాయి రూప్ అనే వ్యక్తి ఈ రా ఎన్టీఆర్ మీల్ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుండి ప్రారంభం కావడంతో చర్చనీయాంశమైంది.
UI The Movie: ఇంత రా అండ్ రస్టిక్ సినిమాలు తీయడం ఉపేంద్రకే సాధ్యం..
నేడు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో రా – ఎన్టీఆర్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సేవలను ఆరంభించారు. అనంతరం పిఠాపురం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు నల్ల గోవింద్, ఉమ్మడి జిల్లా మీడియా కన్వీనర్ ఎన్ ఏ కుమార్ ను సత్కరించి పట్టణంలోని పలు ప్రాంతాలలో పేదవారికి మీల్స్ పొట్లాలు పంపిణీ చేశారు.
ఇక అనంతరం వారు మాట్లాడుతూ .. రా ఎన్టీఆర్ మీల్ సంస్థ చైర్మన్ సాయి రూప్ నిర్ణయంతో ఈ రోజు నుండి రాష్ట్రంలో పేదవారికి అన్నదానం నిర్వహిస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, కేవలం సేవాపరంగానే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఉన్నాయని అయితే అక్కడికి కూడా వెళ్ళలేని వారి కోసం తమ రా ఎన్టీఆర్ సంస్థ పనిచేస్తుందని వారు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Jani Master: బెయిల్ పై వచ్చిన కొన్ని రోజులకే.. మరొక లేడీ డ్యాన్సర్ తో జానీ మాస్టర్.. వీడియో వైరల్
ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు, నెటిజన్స్.. ఈ సేవలు అందిస్తున్నవారిని ప్రశంసిస్తున్నారు. పేదల ఆకలి తీర్చడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని దీవెనలు అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మంచి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ .. దీని తరువాత ఎన్టీఆర్ నీల్ సినిమాలో అడుగుపెట్టనున్నాడు. మరి ఈ సినిమాలతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.