Vi (Vodafone Idea) : స్పామ్ SMSలపై ఇప్పటికే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటి కట్టడికి ప్రముఖ టెలికాం సంస్థలన్నీ తమదైన శైలిలో కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా.. తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేసింది. AI ఆధారిత స్పామ్ SMS గుర్తించి పరిష్కరించే అధునాతన టెక్నిక్ ను పరిచయం చేసింది.
Vi తన వినియోగదారులకు మరింత భద్రతను అందించడానికి సరికొత్త AI- పవర్డ్ స్పామ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను పరిచయం చేసింది. ఈ టెక్నాలజీతో ఏఐ.. స్పామ్ సందేశాలను తేలికగా గుర్తించగలుగుతుంది. ఇక ఈ కొత్త టెక్నాలజీ 24 మిలియన్ స్పామ్ సందేశాలను ఫ్లాగ్ చేసినట్లు తెలుస్తుంది. హానికరమైన సందేశాలను తక్షణమే గుర్తించడమేకాకుండా వాటికి అడ్డుకట్ట వేసే దిశగా పనిచేయనున్నట్లు తెలుస్తుంది.
వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుందంటే –
ఈ కొత్త స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ ను Vi ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విలీనం చేస్తారు. ఇది మిలియన్ ప్రోగ్రామ్స్ పై శిక్షణ పొందిన AI అల్గారిథమ్‌లను ఉపయోగించి ఇన్‌కమింగ్ SMS సందేశాలను విశ్లేషిస్తుంది. మోసపూరిత లింక్స్, అనధికార ప్రమోషన్స్ ను వెంటనే గుర్తిస్తుంది.
Vi స్పామ్ SMSను ఎలా పరిష్కరిస్తుందంటే –
ఈ కొత్త సిస్టమ్ అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పసిగడుతుంది. సందేశాలతో పాటు పంపినవారి వివరాలు, అనుమానాస్పద విషయాలను సైతం గుర్తించడానికి AI అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అనంతరం ఇన్‌కమింగ్ సందేశాలను స్థిరంగా స్కాన్ చేస్తుంది. ఇది స్పామ్ సందేశాలను గుర్తించిన తర్వాత వాటిని సస్పెక్టెడ్ స్పామ్‌గా గుర్తుపెట్టి, హానికరమైన కంటెంట్‌ను నివారించాలంటూ వినియోగదారులకు తక్షణ హెచ్చరికలను అందజేస్తుంది. ఇక ఈ విషయంపై వొడాఫోన్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఇది అభివృద్ధి చెందుతున్న స్పామ్ ట్రెండ్‌లకు అనుగుణంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఎక్కువ మంది కస్టమర్‌లు డిజిటల్ కమ్యూనికేషన్‌ని ఆదరిస్తున్నందున, SMS ఆధారిత స్పామ్‌లు, స్కామ్స్ తో మోసం చేయాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయని దీని వల్ల మోసాలు సైతం పెరిగిపోతున్నాయని Vodafone Idea Limited CTO జగ్బీర్ సింగ్ తెలిపారు. దీంతో రోజురోజుకి పెరుగుతున్న ముప్పును అడ్డుకునే అవకాశం ఉంటుందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్పామ్ మెసేజెస్ ను గుర్తించి, సరైన సమయంలో రక్షణ అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. వోడాఫోన్ ఐడియా యూజర్స్ అనుమానిత స్పామ్ మెసేజెస్ నుండి బయట పడే అవకాశం ఉంటుందని.. యూజర్స్ కు మరింత భద్రత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. మోసపూరిత వాయిస్ కాల్‌లను గుర్తించి బ్లాక్ చేయడానికి సైతం సహాయపుడుతుందని తెలిపారు.
ఇక వొడాఫోన్ ఐడియా తన మొబైల్ యాప్ తో ఆటోమేటిక్ స్పామ్ ఫిర్యాదులు దాఖలు చేసే కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ను సైతం అందిస్తుంది. ఇది స్పామ్ కంటెంట్, పంపినవారి మెుబైల్ నెంబర్స్ ను సైతం గుర్తింస్తుంది. ఆ తారీఖును సైతం గుర్తిస్తుంది. దీంతో సైబర్ క్రైమ్స్ అదుపులో ఉండటమే కాకుండా నిందితులను తేలికగా పట్టుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇక సైబర్ పోలీసులకు సైతం సమాచారం సేకరించటం తేలికవుతుంది.
ALSO READ : ఆహా.. టెక్నో కొత్త ఫోల్డబుల్ మెుబైల్స్.. ధర, ఫీచర్స్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే!