BigTV English

Sekhar Basha : శేఖర్ బాషా మెడకు బిగుస్తున్న ఉచ్చు… మరో కేసు నమోదు

Sekhar Basha : శేఖర్ బాషా మెడకు బిగుస్తున్న ఉచ్చు… మరో కేసు నమోదు
Advertisement

Sekhar Basha : ‘బిగ్ బాస్ సీజన్ 8’ ఫేం కంటెస్టెంట్ శేఖర్ బాషా (Sekhar Basha) మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఒక కేసులో చిక్కుకున్న శేఖర్ బాషాపై తాజాగా మరో కేసు నమోదు అయింది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ (shrasti verma) అతనిపై నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా, ఎఫైర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.


జానీ మాస్టర్ (Jani Master) కేసులో విచారణ జరుగుతుండగా, తన వ్యక్తిగత కాల్ రికార్డ్స్ ని అతను లీక్ చేసాడనే కారణంతో షష్టి వర్మ పోలీసులకు  కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ కంప్లైంట్ లో తన పరువుకు భంగం వాటిల్లేలా అతను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నాడని సృష్టి పేర్కొంది. దురుద్దేశంతో ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేయడం, ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడడం వంటివి చేశాడని, శేఖర్ బాషా దగ్గర ఉన్న పర్సనల్ మొబైల్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేయాలని షష్టి వర్మ తన కంప్లైంట్ లో పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్ బాషాపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటి యాక్ట్ 72 కింద కేసుని నమోదు చేసినట్టు తెలుస్తోంది.

శేఖర్ బాషా ఏమన్నాడంటే ?


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా మాట్లాడుతూ “షష్టి వర్మ జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంది. వాళ్ల అమ్మకు ఈమె పురమాయించడంతో, ఆ తల్లి వెళ్లి నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, తట్టుకోలేక పోతుంది అని అడిగింది. ఎందుకు ఒక అమ్మాయి తనకన్నా ఏజ్ లో అంత పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? ఎందుకంటే అతను చేసుకుంటే తన కెరీర్ బాగుంటుంది అని ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు. రికార్డ్స్ అన్నీ ఉన్నాయి.  వీడియోలు, ఫోటోలు పెడతారు. విడిపోయిన తరువాత కూడా అతన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టేది” అంటూ కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నాడు శేఖర్ బాషా.

శేఖర్ బాషాపై గతంలోనూ కేసు 

ఇక తాజా వివాదంలో లావణ్య, బిగ్ బాస్ శేఖర్ బాషా – మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి కుట్ర చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం ఆమె పోలీసులకు సమర్పించి, ఇలాగే డ్రగ్స్ కేసులో మరో యువతిని కూడా ఇరికించడానికి ప్రయత్నించారని కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులను ఆమె పోలీసులకు అందజేసింది.

అలాగే గత ఏడాది కూడా శేఖర్ బాషాపై లావణ్య వివాదంలోనే కేసు ఫైల్ అయ్యింది. ఓ డిబేట్ లో లావణ్యపై బూతుల పురాణం అందుకుని, దాడి చేయడంతో శేఖర్ బాషాపై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను కడుపు మీద తన్ని, చేతికి గాయం చేశాడంటూ కంప్లైంట్ లో పేర్కొంది. శేఖర్ బాషా వల్ల ప్రాణహాని ఉందంటూ అతనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో, అప్పట్లోనే సెక్షన్ 74, 115(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి లావణ్య, కొరియోగ్రాఫర్ షష్టి వర్మ కంప్లయింట్ చేయడం గమనార్హం.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×