Kiran on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ 2.0 కామెంట్స్‌పై తనదైన శైలిలో కౌంటరిచ్చింది జనసేన. చాలా రోజుల తర్వాత పులివెందుల ఎమ్మెల్యే జగన్ మీడియా ముందుకొచ్చారని అన్నారు తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్. 2.0 గా జగన్.. ఆయనకు ఆయనే అభివర్ణించుకున్నారు.
రజినీకాంత్ 2.0 లో చిట్టి అయితే.. జగన్ 2.0 లో ఆయన పేరు చిట్టి రెడ్డి అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ 2.0 లో జగన్ తల్లి, చెల్లి జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి నిద్రపోయే ముందు హెల్మెట్ పెట్టుకోవాలని సూచన చేశారు. వైసీపీ కార్యకర్తలు కోసం జగన్ 2.0 చూపిస్తానని అంటున్నారని గుర్తు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో జగన్.. ఆ పార్టీ కార్యకర్తలు బలంగా చూపించారని, ఇప్పుడు ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను కాపాడుకునే పనిలో పడ్డారని తెలియజేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి, అరాచకాలను ప్రజలందరూ చూశారని, జగన్ 1.0 లో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
2.0 ద్వారా కార్యకర్తలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు కిరణ్. రాష్ట్ర ప్రజలతోపాటు వైసీపీ కార్యకర్తలు ఇక జగన్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మరో 30 ఏళ్లు మనమే పాలిస్తామని జగన్ అంటున్నారని, ఆయన ఇక్కడ ఉండరని, జైల్లో ఉంటారని మనసులోని మాట బయటపెట్టారు కిరణ్ రాయల్.