Daaku Maharaj:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ (Balakrishna) మనస్తత్వం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం ఎక్కడో ఒకచోట బయట పడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆయనతో సినిమాలలో పనిచేసిన కొంతమంది నేరుగా బాలయ్య మంచి మనసు గురించి చెబితే, మరి కొంతమంది ఆయనను దగ్గరగా చూసినవారు కూడా ఆయన గురించి చెబుతూ ఉంటారు. అయితే బాలయ్య మనసు పిల్లల మనస్తత్వం లాంటిది అని ఇప్పటికే ఎంతోమంది తెలియజేశారు. ఇక ఆ మనస్తత్వానికి కనెక్ట్ అయిన పిల్లలు, ఆయన నుంచి వెళ్లిపోవాలంటే కంటతడి పెట్టుకుంటారు. ఇప్పుడు సరిగ్గా ‘డాకు మహారాజ్’ షూటింగ్ లాస్ట్ రోజు కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద(Veda) కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ తాజాగా డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli)దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో నిలిచి జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే ఈరోజు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చివరి రోజు ప్రతి ఒక్కరు సెండ్ ఆఫ్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వేద అనే చిన్నారి బాలయ్యను విడిచి వెళ్లలేక కన్నీరు పెట్టుకుంది. ఆ పాపని చూస్తుంటే నిజంగా మనకు కూడా కన్నీరాగదు. దీన్ని బట్టి చూస్తే ఆ పాప బాలకృష్ణతో ఎంతలా బాండింగ్ ఏర్పరుచుకుందో అర్థమవుతుంది. ఆ వీడియోలో బాలకృష్ణను వదిలి వెళ్ళలేక ఆయనను హత్తుకొని మరీ ఏడుస్తోంది వేద. ఇక చివరికి బాలకృష్ణ ఆ పాపకు దీవెనలు ఇచ్చి, ఏదో ప్రామిస్ చేసినట్లు కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత తన మాటలతో ఆ పాపను నవ్వించారు బాలయ్య. చివరిగా పాపకు ముద్దు పెట్టి ఆమెను సంతోషంగా వారి తల్లిదండ్రులతో పంపించిన వీడియో మనం చూడవచ్చు .దీన్ని బట్టి చూస్తే వేద అనే ఈ చిన్నారి బాలకృష్ణకు ఎంతలా కనెక్ట్ అయిందో చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇది చూసిన బాలయ్య అభిమానులు మాత్రం మా బాలయ్య బాబు హార్ట్ నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండీ చిన్ని అనే సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సెన్సేషన్ హిట్ అయింది. ఇందులో వేద తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. సెట్లో ఎంతో యాక్టివ్ గా ఉండేదట. అంతేకాదు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేదని, సెట్ మొత్తం కలివిడిగా తిరుగుతూ అందరితో బాగా కనెక్ట్ అయిందని సమాచారం. ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha shrinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు, ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ ను నిర్వహించాల్సి ఉండగా.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఇక్కడ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 6 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ బాధాకర ఘటన కారణంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సంతోషంగా జరుపుకోలేక, అందుకే క్యాన్సిల్ చేస్తున్నానని కూడా బాలయ్య ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.