Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత మూడేళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని థియేటర్లలో వీక్షించి ఎంజాయ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి అప్పన్నగా, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ నందన్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు చెర్రీ. అయితే రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటిదాకా చూసుకుంటే… కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అనగానే ‘రంగస్థలం’ (Rangasthalam) మూవీ గుర్తొస్తుంది.
రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనపై విమర్శలు వినిపించాయి. యాక్టింగ్ కి పనికిరాడు, చిరు వారసుడిగా ఏమాత్రం కనిపించట్లేదు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా సరే చెర్రీ ఏమాత్రం నిరాశ పడకుండా ఒక్కో సినిమాను ఒక్కో మెట్టుగా మలుచుకుంటూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగాడు. అయితే ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచి, తనను వేలెత్తి చూపిన వారితోనే అద్భుతం అంటూ ఆయన నటనపై ప్రశంసల వర్షం కురిపించేలా చేసిన సినిమా ‘రంగస్థలం’.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రామ్ చరణ్ చెవిటి వాడిగా సరదాగా నటిస్తూనే, తన అన్న చావుకు రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు తలుచుకుంటే ఇప్పటికి గూస్ బంప్స్ రావడం పక్కా. సినిమాని చూస్తున్నంత సేపు రామ్ చరణ్ కంటతడి పెడితే మనకు కన్నీళ్లు ఆగవు, ఆయన నవ్వితే మనం కూడా నవ్వుతాము. అలాగే ఆయన రివేంజ్ తీర్చుకునేటప్పుడు ఎంత పగ ప్రతీకారంతో రగిలిపోతాడో, అది మనం కూడా ఫీలయ్యేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చిట్టిబాబు పాత్రలో నటించడం కాదు జీవించారు రామ్ చరణ్.
ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన నటనకు రామ్ చరణ్ ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇప్పటికీ ‘రంగస్థలం’ సినిమానే చెప్పుకుంటారు. కానీ తాజాగా రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ‘రంగస్థలం’ను బీట్ చేయబోతున్నాడని, చిట్టిబాబును మరిపించబోతున్నాడని అంటున్నారు. దీంతో జనవరి 10న థియేటర్లలోకి రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
కరెక్ట్ టైం లో ‘అన్ ప్రిడిక్టబుల్’ సాంగ్
ఇక మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ అవుతున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచేలా ఈ సినిమా నుంచి ‘అన్ ప్రిడిక్టబుల్’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.