Actress Raasi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే పాతకాలం హీరోయిన్స్ కూడా ఇప్పటికీ బాగా ఫేమస్. రోజులు మారుతున్న కొద్దీ వాళ్ళ అందం కూడా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళ ప్రస్తావని వస్తే ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన తెలుగు నటి రాశి.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ మలయాళం కన్నడలో కూడా రాశి (Actress Raasi) సినిమాలు చేసింది. శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి వంటి సినిమాలు రాసికి విపరీతమైన పేరును తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతానికి రాశి కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని రియాల్టీ షోస్ కి హాజరవుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో రాశి శ్రీకాంత్ వీడియో కూడా ఫుల్ వైరల్ గా మారింది.
మామూలుగా హీరోయిన్స్ తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అలానే ఎప్పటికీ లైమ్ లైట్ లో ఉండాలి అని కోరుకుంటారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎవరిని ఇష్టపడరు అనేది వాస్తవం. కానీ రాశి విషయంలో ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగింది. రాశి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా స్వయంగా రాశి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుందాం అని అడిగింది.
రాశి ఇంట్లో వాళ్ళ అన్నయ్య రాశి ను, ఏంటి మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నావట అంటూ క్వశ్చన్ చేశాడు. వెంటనే దానికి సమాధానం గా మ్యారేజ్ చేసుకుంటాను అని నేను అనలేదు. మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను అని రాశి చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ నడిచింది.
ఒక బలమైన కారణం లేకుండా ఎవరు ఎవరిని ఇష్టపడరు. ఇక రాశి కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడానికి కారణం చెప్పారు. రాశి ఒక సీన్ చేస్తున్నప్పుడు, కెమెరా వెనకాల ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కళ్ళల్లో విపరీతంగా నీళ్లు తిరుగుతున్నాయి. ఈ సీను… సీన్ చేస్తున్న రాశి అబ్జర్వ్ చేసి పెళ్లి చేసుకుందామని అసిస్టెంట్ డైరెక్టర్ ను అడిగింది. మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ ను సినిమాకు సంబంధించిన డౌట్స్ ఉంటే అడుగుతారు. లేదంటే తన సీన్ ఎప్పుడు షూట్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడుతారు. డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవడం అనేది రాశి డేర్ స్టెప్ అని చెప్పాలి.
Also Read : OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం