BigTV English

Mansoor Ali Khan : మన్సూర్ పై రెడ్ కార్డు వేటు.. మెగా స్టార్ స్టేట్మెంట్ వైరల్..

Mansoor Ali Khan : మన్సూర్ పై రెడ్ కార్డు వేటు.. మెగా స్టార్ స్టేట్మెంట్ వైరల్..
 Mansoor Ali Khan

Mansoor Ali Khan : ప్రస్తుతం సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పై ప్రముఖ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యానాల పై నెటిజన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక యాక్టర్ గురించే కాకుండా.. ఒక మహిళ గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. మరో పక్క మన్సూర్ అలీఖాన్.. త్రిష గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


మన్సూర్ వ్యాఖ్యల పై కోలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించడమే కాకుండా అతని మాట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా త్రిషకు తమ మద్దతు తెలుపుతూ అతని వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్సీలకి దూరంగా ఉండే మెగాస్టార్ కూడా ఈ ఇష్యూ పై తన గళాన్ని ఎత్తారు.మన్సూర్ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు హేయమైనవని.. ఒక ఆడబిడ్డ గురించి.. తోటి నటీమణి గురించి అలా మాట్లాడడం తప్పు అని తీవ్రంగా ఖండించారు. ఏ ఆడబిడ్డ విషయంలో అయినా ఇలాంటి వ్యాఖ్యలను తాను ఎప్పటికీ సమర్థించనని..కచ్చితంగా ఖండిస్తానని .. చిరు స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోపక్క మన్సూర్.. తాను సరదాగా చేసిన కామెంట్స్ ను ఎవరో కావాలని మార్పు చేసి,తెర వెనుక రాజకీయం ఆడి..తన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. లియో మూవీలో షూటింగ్ సమయంలో త్రిషతో రేప్ సీన్ లేకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యానని ..ఇంతకుముందు సినిమాలలో ఎందరో హీరోయిన్లను ఎత్తుకొని వెళ్లే వాడినని.. త్రిష తో ఒక్క బెడ్ సీన్ కూడా లేదు అని..మన్సూర్ మాట్లాడిన వీడియో పెద్ద దుమారాన్ని లేపింది. త్రిష కూడా అతని మాట తీరుపై తన ఆవేదన వ్యక్తం చేసింది.


విషయం మరీ పెద్దది కావడంతో మన్సూర్ త్రిష కు క్షమాపణలు చెప్పడమే కాకుండా అవసరమైతే సౌత్ ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ కు వివరణ కూడా ఇస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరోపక్క అతనికి రెడ్ కార్డు ఇష్యూ చేయాలి అని భారతీయ సినీ నటుల సంఘం ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఇటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా అతను చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత చూపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నటీనటుల సంఘం ఈ ఇష్యూ ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×