E-Paper
Advertisement

Chiranjeevi: నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన చిరు

Chiranjeevi: నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన చిరు
Advertisement

Chiranjeevi: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నిర్మాత, సినీ రచయిత శ్యామ్ బెనెగల్(90) కన్నుమూసిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్యామ్ ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. ఈ విషయాన్నీ ఆయన కుమార్తె పియా ధృవీకరించింది. దీంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రేట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మృతి చెందడంతో సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. శ్యామ్ మృతిపై ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు సంతాపం తెలిపారు. ” మన దేశంలోని అత్యుత్తమ చలనచిత్ర నిర్మాతలు మరియు గొప్ప మేధావులలో ఒకరైన శ్రీ శ్యామ్ బెనెగల్ మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అతను భారతదేశంలోనే ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించాడు. కొన్ని ప్రకాశంవంతమైన సినిమాలను అందించాడు. అతని సినిమాలు, జీవిత చరిత్రలు మరియు డాక్యుమెంటరీలు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. తోటి హైదరాబాదీ,మాజీ రాజ్యసభ సభ్యుడు.. బెనెగల్ సాబ్ యొక్క అద్భుత రచనలు భారతీయ చలనచిత్రంలో ఎల్లప్పుడూ గొప్ప గౌరవాన్ని పొందుతాయి.. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ బెదిరింపులు.. శ్రీతేజ్ తండ్రి డిమాండ్ ఇదే.. ?

శ్యామ్ హైదరాబాద్ లోనే 1934 లో జన్మించారు. ఆయన చదువు మొత్తాన్ని హైదరాబాద్ లోనే  పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గురుదత్ కు  శ్యామ్ బంధువు. అలా చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తితో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అంకుర్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన  శ్యామ్.. గతేడాది వరకు సినిమాలు తీస్తూనే ఉన్నారు.

Advertisement

నిశాంత్, మంథన్, భూమిక, సర్దారు బేగం, జుబేదా, మండి, త్రికాల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనకు రాని అవార్డు లేదు. 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను  శ్యామ్ అందుకున్నారు. ఏకంగా 18 నేషనల్ అవార్డులను అందుకున్నారు. అలాంటి వ్యక్తి మరణించిన రోజును ఫ్యాన్స్ బ్లాక్ డే అని చెప్పుకొస్తున్నారు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×