BigTV English

Christmas 2024: క్రిస్మర్ వేళ.. కాస్త వెరైటీగా.. ఈ రెసిపీలు ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుందంతే!

Christmas 2024: క్రిస్మర్ వేళ.. కాస్త వెరైటీగా.. ఈ రెసిపీలు ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుందంతే!

క్రిస్మస్ పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది గిఫ్ట్‌లు.. తమ ఫ్రెండ్స్‌కి, బంధువులకు ఇచ్చి ఈ ఫెస్టివల్‌ను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రైస్తవ మతస్థులు అందరూ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొంటారు. క్రిస్మస్‌కి పది రోజుల ముందే ఇంటి ముందు స్టార్స్‌తో పాటు క్రిస్మస్ ట్రీ ని దీపాలతో చాలా ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీటితో పోటీగా రకరకాల వంటకాలు కూడా ఉండాల్సిందేగా మరి.. ఈసారి కాస్త వెరైటీగా ఈ రెసిపీలు తయారు చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుందంతే.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కొబ్బరి రొయ్యల పులావ్..

కావాల్సిన పదార్ధాలు..
రొయ్యలు 1/4 kg
బాస్మతి రైస్ 1/4 కప్పు
ఉల్లిపాయలు రెండు
పచ్చిమిర్చి మూడు
లవంగాలు నాలుగు
దాల్చిన చెక్క
యాలుకలు రెండు
నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్
రుచికి సరిపడ సాల్ట్
రుచికి సరిపడ కారం
పసుపు అరటీస్పూన్
కొబ్బరి పాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్


తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక బౌల్‌లో రొయ్యలు, రుచికి సరిపడ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడర్ టీ స్పూన్, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేస్తే ఫ్లీవర్స్ అన్ని ప్రాన్స్‌కి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి.

కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యల మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. 15-20 నిమిషాలు  మూత పెట్టి ఉంచండి. అందులో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి. పలుకులు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల కొబ్బరిపాలు తీసుకొని అందులో యాడ్ చేయండి. గ్యాస్ మంట లో ఫ్లేమ్‌లో పెట్టండి. 15-30 మినిట్స్‌లో బిర్యానీ రెడీ అవుతుంది. అంతే సింపుల్ గుమగుమలాడే కొబ్బరి పులావ్ రెడీ అయినట్లే..

క్రిస్మస్ స్పెషల్ డ్రైఫ్రూట్స్ కేక్..
కావాలిసిన పదార్ధాలు..
ఆరెంజ్ జ్యూస్ అరకప్పు
బ్లాక్ కిస్‌మిస్‌లు
రెండు టీ స్పూన్ బాదం
రెండు టీ స్పూన్లు కిస్‌మిస్‌లు
సన్నగా కట్ చేసిన జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు
టూటీ ఫ్రూట్స్ మూడు టీస్పూన్లు
షుగర్ అరకప్పు
యాలుకలు రెండు
పంచదార
మైదాపిండి

తయారు చేసుకునే విధానం..
ఒక గిన్నెలో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్‌మిస్‌లు, రెండు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన బాదం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్‌మిస్‌లు, రెండు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, గుప్పెడు టూటీ ఫ్రూటీలను వేసాకా వాటిని మిక్స్ చేసి రెండు, మూడు గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో అరకప్పు షుగర్ వేసి లో ఫ్లేమ్‌లో బాగా కలుపుతూ ఉంటే.. చక్కెర బాగా కరిగిపోయి గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది. ఇలా ప్రిపేర్ చేస్తున్న షుగర్ సిరప్ మాడి పోకుండా చూసుకోండి. లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో పావు కప్పు వాటర్ తీసుకుని అందులో కొంచెం కొంచెం పోస్తూ ఉండండి. షుగర్ సిరప్ రెడీ అవుతుంది.

దాన్ని చిన్న బౌల్‌లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ చక్కెర, చిన్న దాల్చిన చెక్క, రెండు యాలుకలు, రెండు లవంగాలు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. అందులో నెయ్యి లేదా పావుకప్పు ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ పాలు పోసి మెత్తగా గ్రైండ్ చెయ్యండి. కేకు తయారు చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండి, టీ స్పూన్ కోకో పౌడర్, ముందుగా ఆరెంజ్ జ్యూస్‌లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని వేసి బాగా మిక్స్ చేయండి.

Also Read: పనీర్‌తో ఇలా గులాబ్ జామున్ చేసేయండి, రుచి కొత్తగా అదిరిపోయేలా ఉంటుంది

ఇప్పుడు అందులో తయారు చేసుకున్న కారామిల్ షుగర్ సిరప్, అలాగే గ్రైండ్ చేసుకున్న షుగర్ మిక్స్‌ను తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి ప్లమ్ కేక్ ఎస్సెన్స్ సిరప్ రెండు చుక్కలు వేసి కలపండి. అందులో టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ బేకింగ్ సోడా, చిటెకెడు సాల్ట్, టీ స్పూన్ వెనిగర్ వేసి కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కేక్ పాన్‌లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇందులో ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని తీసుకుని రెండు సార్లు ట్యాప్ చేయండి.

ఇప్పుడు దానిపైన మరికొన్ని డ్రైఫ్రూట్స్ తీసుకుని కొంచెం పొడిపిండిలో కలిపి డెకరేషన్ చెయ్యండి. ఇలా ప్రిపేర్ చేసిన కేకుని బేక్ చెయ్యడానికి మందంగా పెద్దగా ఉన్న గిన్నె తీసుకుని అందులో స్టాండ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేడి చేయాలి. మూత తీసి కేక్ పాన్ పెట్టి లోపల హీట్ అనేది బయటకు పోకుండా బాగా కవర్ చెయ్యండి. ఇలా అరగంటపాటు ఉంచితే కేకు రెడీ అవుతుంది. అంతే సింపుల్ క్రిస్మస్ స్పెషల్ డ్రైఫ్రూట్స్ కేక్ రెడీ అయినట్లే.

 

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×