Allu Arjun: డిసెంబర్ 4 నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓకే ఒక్క పేరు అల్లు అర్జున్. పుష్ప2 బెన్ ఫిట్ షోలో జరిగిన ఘటనను ఎవరు మర్చిపోలేకపోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతికి న్యాయం చేయాలనీ ఒకపక్క.. తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు శ్రీతేజ్ బతకాలని ఇంకోపక్క ప్రజలు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ మును అరెస్ట్ చేయడం.. విచారించడానికి కోర్టుకు తీసుకెళ్లడం.. బన్నీ బెయిల్ పై రావడం జరిగింది. అక్కడితో ఈ సమస్య ఆగలేదు. అసెంబ్లీ వరకు పాకి రాజకీయపరంగా కూడా పెద్ద వివాదంగా చెలరేగింది. సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ గురించి మాట్లాడడం.. అందులో నిజం లేదని బన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఇలా రోజుకోకటి నడుస్తుంది. ఇక శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను మీడియా ముందుకు రానివ్వకుండా అల్లు అర్జున్ టీమ్ బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun: బ్రేకింగ్.. రేవతి కేసులో ట్విస్ట్.. అల్లు అర్జున్ కు నోటీసులు
తాజాగా ఈ బెదిరింపులపై శ్రీతేజ్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. అలాంటి బెదిరింపులు ఏవి రాలేదని, హాస్పిటల్ లో అన్ని బన్నీనే చేసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. ” అలాంటి వార్తల్లో నిజం లేదు. వారి నుంచి సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ ఉంది. వాళ్ల మేనేజర్స్ వచ్చి చూసుకున్నారు. రోజూ వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు. సర్జరీ అయ్యేవరకు వారే వచ్చి చూసుకున్నారు. ఇప్పటివరకు రూ. 10 లక్షలు ఇచ్చారు. ఇంకో రూ. 15 లక్షలు అరెంజ్ చేస్తామని చెప్పారు. డబ్బులు సర్దుబాటు అయ్యాక కాల్ చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం అన్ని వారే చూసుకుంటున్నారు. డాక్టర్స్ కూడా మమ్మల్ని ఏమి డబ్బులు అడగడం లేదు. బాబుకు ఎలాంటి చికిత్స చేసినా మాకు చెప్పే చేస్తున్నారు. బాబు ఎంత త్వరగా కోలుకొంటే అంత బావుంటుందని కోరుకుంటున్నాను. రెండో రోజు నుంచి నేను చెప్తున్నాను. అల్లు అర్జున్ తప్పేమి లేదు. కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్పాను. అది ఎవరు బెదిరించడం వలనో కాదు. మా వలన పాపం అతను జైలుకు వెళ్తున్నాడు అంటే కాంప్రమైజ్ అయ్యి కేసు రిటర్న్ తీసుకుంటాను అని అన్నాను.
Shyam Benegal: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత
నాకున్న డిమాండ్ ఒకటే.. నా కొడుకు పూర్తిగా కోలుకొని ఇండికి వచ్చే వరకు వారి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడు.. ఆ దేవుడు ఉన్నాడు అని కొందరు… భార్య లేని లోటు తీర్చలేరు.. పిల్లలను జాగ్రత్తగా చూసుకొండి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.