BigTV English

Chiranjeevi:తమిళ దర్శకుడితో మెగాస్టార్.. కుమార్తె నిర్మాతగా!

Chiranjeevi:తమిళ దర్శకుడితో మెగాస్టార్.. కుమార్తె నిర్మాతగా!

Chiranjeevi:ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి .. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భోళా శంకర్’ మూవీని పూర్తి చేయ‌టంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌నే టాక్ అయితే వినిపిస్తోంది. కాగా.. చిరు నెక్ట్స్ మూవీ ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల మేర‌కు.. చిరంజీవి త‌న నెక్ట్స్ మూవీని ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్నారు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. పి.ఎస్‌.మిత్ర‌న్‌. ఈయ‌న ఇంత‌కు ముందు విశాల్‌తో అభిమ‌న్యుడు, హీరో, స‌ర్దార్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. అన్నీ సినిమాలు స‌క్సెస్ అయిన‌వే.


ఇప్పుడు మిత్ర‌న్ స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌టానికి రెడీ అయిపోయారు. అది కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కావ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాకు క‌థ‌ను మ‌న తెలుగు రైట‌ర్ బి.వి.ఎస్‌.ర‌వి అందిస్తున్నారు. సినిమాను నిర్మించ‌బోయేదెవ‌రో కాదు.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత. కొన్ని రోజుల నుంచి పెద్ద కుమార్తె బ్యాన‌ర్‌లో చిరంజీవి సినిమా చేస్తార‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఆ సినిమా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింద‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌.

PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్‌ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్


Nani 30: నాని 30 కోసం భారీ రెమ్యూనరేషన్!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×