Chiranjeevi: ముంబైలోని బాంద్రా లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నివాసంలో గురువారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడి.. సైఫ్ అలీ ఖాన్ పై పలుమార్లు కత్తితో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన హాస్పిటల్ లో చేరడంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ దాడిపై స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR )తన అధికారిక ఖాతా ట్విట్టర్ ద్వారా.. త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..” సైఫ్ అలీఖాన్ పై దుండగుడు దాడి వార్తతో తీవ్ర కలత చెందాను.ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎలా జరిగిందంటే?
ముంబైలోని బాంద్రాలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో.. ఒక ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించారట. మొదట ఆ ఇంటి పనిమనిషిపై దాడి చేస్తుండగా ఉలిక్కిపడిన సైఫ్ అలీ ఖాన్.. అతడిని అడ్డుకొని శాంతింప చేసే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో ఆగంతకుడు పలుమార్లు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో గాయపడిన ఈయనను.. దగ్గర్లో ఉన్న లీలావతి హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇక వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా.. ఆరుసార్లు కత్తిపోట్లు శరీరంలోకి దిగాయని, అందులో రెండు కత్తి పోట్లు మరింత లోతుగా దిగాయని వైద్యులు వెల్లడించారు. ఇక కరీనాకపూర్, ఆమె సోదరీ కరిష్మా కపూర్ తెల్లవారుజామున 4:30 గంటలకు హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం అటు అభిమానులలో, ఇటు సెలబ్రిటీలలో కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు ఈ కుటుంబంలోకి చొరబడిన వ్యక్తి ఎవరు? దేనికోసం ఇంట్లోకి వచ్చారు? సైఫ్ అలీఖాన్ పై ఎందుకు దాడి చేశారు? అసలేం జరుగుతోంది? అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
చిరంజీవి సినిమాలు..
ఆరు పదుల వయసు దాటినా సరే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ప్రస్తుతం ఆయన బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట మల్లిడి (Vasista mallidi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వంభర’. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మే నెలకు వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల (Srikanth odala) డైరెక్షన్లో ఒక సినిమా, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi ) తో ఒక సినిమా చేయబోతున్నారు చిరంజీవి. మరి ఈ సినిమాలతో చిరంజీవి మరింత సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Deeply Disturbed by news of the attack by an intruder on #SaifAliKhan
Wishing and praying for his speedy recovery.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 16, 2025