Manchu Manoj: మామూలుగా చిన్న కుటుంబం గొడవే కదా.. త్వరలోనే అంతా సర్దుకుంటుందని అనుకున్నారంతా. కానీ మంచు ఫ్యామిలీలో మొదలయిన చిచ్చు ఇంకా అలాగే రగులుతూనే ఉంది. తండ్రీ, కొడుకుల మధ్య చిన్నగా మొదలయిన మనస్పర్థలు పోలీస్ స్టేషన్, కేసు అన్నంత వరకు వెళ్లాయి. డిసెంబర్‌లో ఈ గొడవ మొదలయిన తర్వాత కొన్నాళ్ల పాటు అంతా సాఫీగానే సాగిపోతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే సంక్రాంతి వేడుకల వల్ల మళ్లీ చిచ్చు మొదలయ్యింది. కలిసి వేడుకల్లో సంతోషంగా పాల్గొనాల్సిన తండ్రీకొడుకులు మళ్లీ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లారు.
పోలీసులకు మద్దతు
ప్రతీ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఆ వేడుకలను నిర్వహించడం కోసం మోహన్ బాబు స్వయంగా ఆ యూనివర్సిటీకి వెళ్లారు. మంచు ఫ్యామిలీలో అంతా బాగున్నప్పుడు మోహన్ బాబుతో పాటు మనోజ్ కూడా అక్కడికి వచ్చేవాడు. కానీ ఈసారి వారి మధ్య మనస్పర్థలు మామూలుగా లేవు. అందుకే మోహన్ బాబు మాత్రమే విష్ణుతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడికి మనోజ్ కూడా రావాలని అనుకున్నాడు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. మోహన్ బాబు సైతం మనోజ్‌ను అడ్డుకునే విషయంలో పోలీసులకే మద్దతు తెలిపారు. దీంతో మనోజ్ మరోసారి తన ప్రతాపం చూపించడానికి సిద్ధమయ్యాడు.
అందుకే వచ్చాను
మంచు మనోజ్ (Manchu Manoj).. మోహన్ బాబు యూనివర్సిటీకి రావొద్దంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానిని దిక్కరించి మరీ యూనివర్సిటీ వద్దకు వచ్చాడు మనోజ్. ఈ విషయంలో మోహన్ బాబు సైతం కోర్టు ఆదేశాలను ధిక్కరించాడంటూ మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మనోజ్‌కు మళ్లీ కోపమొచ్చింది. తండ్రిపై మరో ఫిర్యాదుకు సిద్ధపడ్డాడు. ప్రతీ ఏడాదిలాగానే కనుమ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ సమాధులను దర్శించుకోవడానికి వెళ్తే మోహన్ బాబు (Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu).. తమ అనుచరులతో దాడి చేయించారని చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడు మనోజ్. అయినా తండ్రి, అన్నపై మనోజ్ ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.
Also Read: వైరల్ గా మారిన క్రేజీ న్యూస్.. బాలీవుడ్ మూవీలో ప్రభాస్, అల్లు అర్జున్..!
సర్దుకునేలా లేవు!
మనోజ్ యూనివర్సిటీలో అడుగుపెట్టకూడదని తనకు కోర్టు ఆదేశాలను చూపించారు మోహన్ బాబు. తనను యూనివర్సిటీలో అడుగుపెట్టకుండా చేశారని తండ్రి, అన్నపైనే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు మంచు మనోజ్. ఇదంతా చూస్తుంటే ఈ కుటుంబ గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈగో వల్ల తండ్రీకొడుకులు ఇద్దరూ తగ్గడం లేదని, ఇలాగే సాగుతూ ఉంటే ఈ కుటుంబం మధ్య మొదలయిన కలహాలు ఎప్పటికీ తీరవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీలో గొడవలు ఎప్పటికి సర్దుకుంటాయా అని ఇండస్ట్రీ నిపుణులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
నిన్న జరిగిన ఘటనపై ఫిర్యాదు pic.twitter.com/BQutkeX1a8
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025