BigTV English

Chiranjeevi: న్యూ ఇయర్ రోజున మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇంత మోసం చేశారేంటి బ్రో.!

Chiranjeevi: న్యూ ఇయర్ రోజున మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇంత మోసం చేశారేంటి బ్రో.!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై చూడడం అనేది మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. కానీ చిరు మాత్రం సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించారు. వరుసగా రీమేక్స్ చేయడం.. అవి ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం కాస్త ఆలోచించి గ్యాప్ ఇచ్చి సినిమాలు చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో న్యూ ఇయర్‌కు చిరంజీవి ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి అందరినీ డిసప్పాయింట్ చేశారు. చిరు ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ రోజున బ్యాడ్ న్యూస్ చెప్పినట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా..


ఫ్యాన్స్ ఆశలు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఎన్నో క్లాసిక్ హిట్స్ తెరకెక్కాయి. ఇప్పటికీ ఆయన సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తారు ప్రేక్షకులు. దాదాపు మూడు తరాల నుండి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అలా 27 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి ‘హిట్లర్’. ఈ సినిమాకు, ఇందులో చిరు నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి చిత్రాన్ని మరోసారి వెండితెరపై చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు. 2025 న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ‘హిట్లర్’ రీ రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. దీంతో బాస్ వింటేజ్ సినిమా, లుక్స్ చూసి ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇంతలోనే వారి ఆశలు నిరాశలయ్యాయి.


Also Read: ఫైనల్‌గా షూటింగ్ సెట్‌లో అయ్యగారు.. అఖిల్ నెక్స్‌ట్ మూవీ గురించి ఆసక్తికర అప్డేట్

విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నాం

2025 జనవరి 1న విడుదల కావాల్సిన ‘హిట్లర్’ పోస్ట్‌పోన్ అయ్యింది. టెక్నికల్ కారణాల వల్లే పోస్ట్‌పోన్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని రీ రిలీజ్‌కు సిద్ధం చేసిన సాయి సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా అధికారికంగా దీని గురించి ప్రకటించింది. ‘మేము విశ్రాంతి లేకుండా ఈ సినిమాను అద్భుతమైన రూపంలో మీకు అందించడానికి కష్టపడుతున్నాం. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే వచ్చేస్తుంది’ అని చెప్పింది. దీంతో న్యూ ఇయర్ రోజున మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో చూడడానికి కొత్తగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ‘హిట్లర్’ (Hitler) రీ రిలీజ్‌కు వెళ్లాలని చాలామంది మూవీ లవర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

‘హిట్లర్’ హిస్టరీ

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్లర్’లో చిరంజీవికి జోడీగా రంభ నటించింది. కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మెగాస్టార్ క్లాసిక్స్‌లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. గత కొన్నేళ్లుగా చిరంజీవి నటించిన సినిమాలు ఏవీ ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ఒక రీమేక్ చిత్రంతో సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు చిరు. అలా వరుసగా పలు రీమేక్స్ చేశారు. ఇక చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ‘భోళా శంకర్’ను డిశాస్టర్ చేశారు. దీంతో యంగ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×