BigTV English

Sangeetha Bijlani: సల్మాన్ తో పదేళ్లకు పైగా లవ్.. పెళ్లి చేసుకున్నామనే లోపే.. కట్ చేస్తే..!

Sangeetha Bijlani: సల్మాన్ తో పదేళ్లకు పైగా లవ్.. పెళ్లి చేసుకున్నామనే లోపే.. కట్ చేస్తే..!

Sangeetha Bijlani:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అప్పట్లో బాలీవుడ్ లో ఉన్న హీరోలు ఎవరు కూడా సౌత్ ఇండస్ట్రీలో ఉండే ప్రేక్షకులకు ఎక్కువగా తెలియక పోయేవారు. కానీ సల్మాన్ ఖాన్ అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఫేమస్ హీరోనే. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలు అప్పట్లో ఎంత పెద్ద హిట్ కొట్టేవో చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించే హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు.అయితే అలాంటి ఈ హీరో 50 ఏళ్ల వయసు దాటినా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంటున్నారు.


సల్మాన్ ఖాన్ పెళ్లిపై తండ్రి కామెంట్స్..

ఇక సల్మాన్ ఖాన్ ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం గురించి తన తండ్రి మాట్లాడుతూ.. “సల్మాన్ ఖాన్ కి భార్యగా వచ్చే అమ్మాయి అన్ని అర్థం చేసుకునేదిగా ఉండాలి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ను తన తల్లి ఎలా అయితే అర్థం చేసుకుంటుందో.. అచ్చం ఇలాంటి అమ్మాయే తనకు భార్యగా రావాలి అని” కోరుకుంటున్నాడు. ఇలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడు అంటూ సల్మాన్ తండ్రి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకొని ఇండస్ట్రీలో ఎప్పటికీ హాట్ టాపిక్ గానే మారుతున్నారు.


పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్లి..

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ తో మాత్రమే కాకుండా సంగీత బిజ్లాని(Sangeetha bijlani )అనే హీరోయిన్ తో కూడా పెళ్లి వరకు వెళ్లారు. వీరిద్దరూ గతంలో చాలా గాఢంగా ప్రేమించుకొని ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి కూడా రెడీ అయ్యారు. వీరి పెళ్లి మీడియాలో అప్పట్లో అతిపెద్ద హాట్ టాపిక్.. అయితే పెళ్లి ముహూర్తం పెట్టుకొని పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించాక సడన్ గా వీరి పెళ్లి ఆగిపోయింది. మరి వీరి పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఏంటో తెలియదు. కానీ పెళ్లి కార్డులు కూడా కొట్టించాక ఎందుకు వీరి పెళ్లి పీటల వరకు వెళ్లలేదో మాత్రం ఎవరికి తెలియదు. అయితే ఇదే విషయంపై తాజాగా సంగీత బిజ్లాని చెప్పుకొచ్చింది.

స్పందించిన సంగీత బిజ్లానీ..

సంగీత బిజ్లాని తాజాగా ఇండియన్ ఐడల్ 15 షో కి చీఫ్ గెస్ట్ గా వచ్చింది. అయితే ఈ షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ మీరు సల్మాన్ ఖాన్ తో పెళ్లి వరకు వెళ్లి, పెళ్లి కార్డు కూడా అచ్చు వేయించాక ఎందుకు విడిపోయారు.. మీ మీద వచ్చిన ఈ వార్త నిజమేనా అని సంగీత బిజ్లాని అడగగా.. అబద్ధమైతే కాదు అంటూ పరోక్షంగా అది నిజమే అంటూ మాట్లాడింది. అయితే మీరు ఎందుకు విడిపోయారు అని ఆ కంటెస్టెంట్ అడిగింది. కానీ అక్కడితో ప్రోమో ముగిసింది. మరి సల్మాన్ ఖాన్ తో ఎందుకు విడిపోయిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో సంగీత బిజ్లాని ఆన్సర్ ఏమిస్తుందో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి కారణం ఏంటో..ఇక సంగీత బిజ్లాని సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ అయ్యాక మహ్మద్ అజారుద్దీన్ ని పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్ధల కారణంగా ఆయనతో కూడా విడాకులు తీసుకుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×