BigTV English

Chiranjeevi: ఈ షూ చూడడానికే సింపుల్.. ఖరీదు తెలిస్తే గుండె గుబేల్..!

Chiranjeevi: ఈ షూ చూడడానికే సింపుల్.. ఖరీదు తెలిస్తే గుండె గుబేల్..!

Chiranjeevi: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయినా చూడడానికి చాలా సింపుల్ గా ఉంటూ అడిగినవారికి సహాయాలు చేస్తూ గొప్ప మనిషిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే సినిమాలలో క్యారెక్టర్ కు తగ్గట్టుగా లగ్జరీగా కనిపించే చిరంజీవి బయట మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తారు. అయితే ఆ సింపుల్ గా కనిపించినా.. ఆయన ధరించే దుస్తులు , ఇతర వస్తువుల ఖరీదు తెలిస్తే మాత్రం మన గుండె గుబేల్ అనాల్సిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలవడానికి వెళ్ళారు చిరంజీవి. అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా ఆయన ధరించిన షూ అందరిని ఆకర్షించింది. ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఖరీదు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. మరి వాటి ఖరీదు ఎంత..? చిరంజీవి ఎందుకు సీఎం ను కలిసారు..?ఇలా విషయాలు ఇప్పుడు చూద్దాం..


దసరా సందర్భంగా సీఎంను కలిసిన చిరంజీవి..

ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ ప్రజలను ఆదుకోవడానికి సినీ సెలబ్రిటీలు ,రాజకీయ నాయకులు, పలువురు బడా వ్యాపారవేత్తలు, ఆఖరికి సామాన్య ప్రజలు కూడా తమ వంతు సహాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం ఫండ్ కు ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఆ కోటి రూపాయల చెక్కును అందజేయడానికి నిన్న దసరా పండుగ సందర్భంగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎంను నేరుగా కలిసి చెక్ అందజేశారు. ఇక ఈ సందర్భంగా అక్కడ నుంచి కొన్ని ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అక్కడ చిరంజీవి లుక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.


చిరంజీవి వేసుకున్న షూ ఖరీదు ఎంతంటే..?

చిరంజీవి వేసుకున్న షూ అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. మరి అవి ఏ బ్రాండ్? ఖరీదు ఎంత ?అనే విషయానికి వస్తే.. చిరంజీవి వేసుకున్న షూ గూచ్చి (Gucci )బ్రాండ్ కు చెందినవి. ఇవి ముందు నుండి షూ లాగా, వెనుక నుండి స్లిప్పర్ లాగా అనిపిస్తాయి. వీటిని Mules అంటారు. చిరు కాలికి ఉన్న Gucci GG Horsebit Mules ధర అక్షరాల లక్ష రూపాయలు. ఇక ఇవి చూడడానికి చాలా సింపుల్ గా కనిపించినా.. వీటి ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా చిరంజీవి రేంజ్ అంటే మినిమం ఉంటుంది అంటే అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

టీజర్ విడుదలకు అందుకే రాలేదు..

మరోవైపు సీఎంను కలవడానికి వెళ్లారు కాబట్టే ఆయన విశ్వంభర టీజర్ విడుదల కార్యక్రమానికి రాలేదు అని తెలుస్తోంది. ఇక నిన్న శనివారం అనగా విజయదశమి సందర్భంగా బాలానగర్ విమల్ థియేటర్లో టీజర్ లాంఛ్ కార్యక్రమం జరగగా చిరంజీవి వస్తారని అభిమానులనుకున్నారు. కానీ ఆయన రాలేదు. అయితే ఇటీవల టీజర్ విడుదల చేయగా.. ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించగా.. మరికొంతమంది మొత్తం హాలీవుడ్ మూవీ ని కాపీ కొట్టేసారని కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×