BigTV English
Advertisement

Chiranjeevi : లిటిల్‌ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. చిరంజీవి ట్వీట్ వైరల్ ..

Chiranjeevi : లిటిల్‌ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. చిరంజీవి ట్వీట్ వైరల్ ..


Chiranjeevi : రామ్‌ చరణ్‌ -ఉపాసన దంపతులు తల్లిదండ్రుల కావడంతో మెగాస్టార్‌ చిరంజీవి ఇంట సంబరాలు జరుగుతున్నాయి. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు కూతురు పుట్టడంపై చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతమంటూ ట్వీట్ చేశారు. నీ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు కోట్లాది మందిలో ఆనందాన్ని పంచావని పేర్కొన్నారు. రామ్ చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ గా సంతోషించేలా చేశావంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, ఇతర కుటుంబసభ్యులు సోమవారం రాత్రి నుంచి డెలివరీ అయ్యే వరకు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వారసురాలి రాకతో వారంతా ఆనందంలో మునిగిపోయారు. చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ ఆస్పత్రి వద్దకు వచ్చారు. కూతురు పుట్టడంతో చెర్రీ 2నెలలపాటు షూటింగ్‌కు విరామం ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నాడు.


మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా సంబరాలు మొదలుబెట్టారు. మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్‌తో తమ ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫ‍్యాన్స్ పంచుకుంటున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్‌ సింబల్‌లా మాదిరిగా ఉన్న బెలూన్స్‌ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×