BigTV English

Upasana New Business: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..!

Upasana New Business: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..!

Ram Charan Wife Upasana New Business: మెగాస్టార్ ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా.. సంతోషంతో చూడముచ్చటగా ఉంటారు. ‘కలిసుంటే కలదు సుఖం’ అన్నట్టు అంతా కలిసి మెలిసి ఉంటారు. ఆ ఫ్యామిలీని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మెగాస్టార్ తన తల్లి, భార్య, పిల్లలపై చూపించే ప్రేమను.. యంగ్ హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా అలానే నెట్టికొస్తున్నారు.


అయితే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. మరి ఇంట్లో ఉండే చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, కోడలు ఉపాసన ఏం చేస్తుంటారు అని అంతా అనుకోవచ్చు. అయితే వాళ్లు ఈ మధ్యనే ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు. చిరు సతీమణి సురేఖ బర్త్ డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఉపాసన ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించారు.

సంప్రదాయ రుచులతో ఇంట్లో చేసుకునే వంటకంలా తమ ప్రొడక్ట్స్ ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు వారు అదే పనిమీద ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. నోరూరించే ఆవకాయ పచ్చడిని చిరు భార్య సురేఖ తన చేతులతో ప్రిపేర్ చేయడం.


Also Read: అత్త పుట్టినరోజు.. మెగా కోడళ్ల కొత్త బిజినెస్‌!

అవునండీ మీరు విన్నది నిజమే.. సురేఖ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అందులో అంజనాదేవి, సురేఖను చూడవచ్చు. సురేఖ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు.. అక్కడే అంజనాదేవి కూర్చుని చూస్తుంది.

వీటంతటిని ఉపాసన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముందుగా అంజనాదేవి దగ్గరకు వెళ్లి నాయనమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్‌గా ఉన్నారు అని అంటుంది. దానికి ఆమె పనిలేక ఇక్కడ కూర్చున్న అంటుంది. ఆ తర్వాత సురేఖ దగ్గరకు వెళ్లి అత్తమ్మ క్యా హోరా అత్తమ్మ అంటుంది. ఆ తర్వాత వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్ అంటూ ఆ వీడియో చివర్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధిన వీడియో చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ ఎంత చూడ ముచ్చటగా ఉందో అని కామెంట్లు పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×