BigTV English

Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చిరంజీవి కీలక విజ్ఞప్తి

Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చిరంజీవి కీలక విజ్ఞప్తి

Chiranjeevi’s key appeal people to be cautious in the wake of heavy rains in telugu states: తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వాన ప్రభావం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మునుపెన్నడూ చూడని భయానక వాతావరణం నెలకొంది. రోడ్లపైనే కృష్ణానది పారుతుందా.. అనేంతలా వర్షం కురిసింది. పేకమేడల్లా కొండచరియలు కూలిపోతున్నాయి. నెలరోజుల్లో కురవాల్సిన వాన.. ఒక్క రోజులోనే కురిసిందా అనేట్లుగా పరిస్థితి మారటంతో బెజవాడ గజగజలాడుతోంది.


బంగాళాఖాతంలోని వాయుగుండం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 వరకు ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో చాలా చోట్ల మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తీరప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. CS, DGP, మంత్రుల, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. సహాయక చర్యల కోసం జిల్లాకు మూడు కోట్లు చొప్పున ప్రకటింటారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకూ అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దనిప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.

ఇక తెలంగాణా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కుపరుస్తాయనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Also Read: తెలంగాణకు రెడ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు .రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదు అని ఆదేశించారు.

“ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కారణంగా చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.

ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను🙏” అంటూ ఎక్స్ వేధికగా తెలిపారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×