BigTV English

Chiru – Nag: దసరా సెలబ్రేషన్స్ లో స్టార్ హీరోలు.. పంచకట్టులో ఆకట్టుకున్న చిరు..!

Chiru – Nag: దసరా సెలబ్రేషన్స్ లో స్టార్ హీరోలు.. పంచకట్టులో ఆకట్టుకున్న చిరు..!

Chiru – Nag.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కింగ్ నాగార్జున (Nagarjuna)ఓకే చోటా కనిపించి అభిమానులకు కన్నుల విందు చేశారు. తాజాగా నాగార్జున , చిరంజీవి కలసి దసరా సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం. కళ్యాణ్ జ్యువెలర్స్ ఎమ్.డి కళ్యాణ్ రామన్ ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.నాగార్జున ఎప్పటినుంచో కళ్యాణ్ జువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కూడా దసరా వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. దీంతో నాగార్జున, చిరంజీవి కలసి కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత కళ్యాణ్ రామన్ ఇంట్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్లో సంయుక్తంగా పాల్గొని సందడి చేశారు.


కళ్యాణ్ జువెలర్స్ అధినేత ఇంట్లో దసరా సంబరాలు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిరంజీవి , నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉందో మరొకసారి అందరికీ గుర్తు చేశారు వీరిద్దరు. ఇప్పుడు ఇలా ఇద్దరిని కలిసి మరోసారి చూడడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇరువురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మెరూన్ ప్రింటెడ్ షర్ట్ ధరించి క్లాసిక్ అద్దాలతో మరింత క్లాస్ గా కనిపించారు నాగార్జున. మరొకవైపు పంచకట్టులో సాంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు చిరంజీవి. ఇద్దరు కూడా తమ వేషధారణతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.


చిరంజీవి కెరియర్..

ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు మరొకవైపు వ్యాపార రంగంలో బిజీగా మారిపోయారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన అదే ఏడాది భోళాశంకర్ సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ఇప్పుడు బింబిసారా డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయగా.. ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నా మరొక వర్గం ప్రేక్షకులు మొత్తం విఎఫ్ఎక్స్ అని హాలీవుడ్ మూవీ ని కాపీ చేశారు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

నాగార్జున కెరియర్..

మరోవైపు కింగ్ నాగార్జున విషయానికి వస్తే.. హీరోగా చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన మరొకవైపు రజనీకాంత్ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. మొదటిసారి విలన్ అవతారం ఎత్తి తనలోని మరో యాంగిల్ ను చూపించబోతున్నారట నాగార్జున. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్టుగా వ్యవహరిస్తూ మరొకసారి తన యాంకరింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి హోస్టుగా మారిన ఈయన ఇప్పటికీ హోస్టు గానే కొనసాగుతూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. మొత్తానికి అయితే టైర్ -1 హీరోలుగా పేరు సొంతం చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఖుషీ చేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×