BigTV English

Choreographer Rekha: రూమ్ కి ఎందుకు తీసుకెళ్తారో ఆమెకు తెలియదా.. జానీ మాస్టర్ తప్పేమి లేదు

Choreographer Rekha: రూమ్ కి ఎందుకు తీసుకెళ్తారో ఆమెకు తెలియదా.. జానీ మాస్టర్ తప్పేమి లేదు

Choreographer Rekha: కొరియోగ్రాఫర్  రేఖ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా .. ఢీ షో ద్వారా రేఖ తెలుగువారికి సుపరిచితమే. ఇక ఆమె భర్త చిన్ని ప్రకాష్ తో సహా రేఖ తెలుగులో ఎన్నో డ్యాన్స్ షోస్  కు జడ్జ్  లుగా వ్యవహరించారు. బాలీవుడ్ ఈ భార్యాభర్తలు ఎన్నో మంచి సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు.


ముఖ్యంగా రేఖ.. జోధా అక్బర్, బాద్షా, భాజీ ఘర్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్..  లాంటి సినిమాల ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.  గత కొంతకాలంగా ఈ భార్యాభర్తలు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలాకాలం తరువాత ఆమె ఒక యూట్యూబ్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో రేఖా ప్రకాష్ తమ మనోగతాన్ని బయటపెట్టింది. తన చిన్నతనం తాలూకు జ్ఞాపకాల నుంచి కెరీర్, ప్రేమ, పెళ్లి .. ఇలా అన్నిటి గురించి చెప్పుకొచ్చింది.  వీటితో పాటు ఆమె జానీ మాస్టర్ వివాదం గురించి కూడా మాట్లాడింది.

గతేడాది జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ డ్యాన్సర్  గా పనిచేస్తున్న ఒక యువతీ .. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని, తనను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా మతం మార్చుకోమని కూడా ఒత్తిడి తెస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు లో హాజరుపరిచారు.


Jayam Ravi: విశాల్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో

ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఈ జైలు జీవితం తనకు  ఎంతో నేర్పిందని జానీ చెప్పుకొచ్చాడు. అయితే జానీ కేసు మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమంది జానీ చేసింది తప్పు అని చెప్పగా.. ఇంకొంతమంది ఆ  యువతీది కూడా తప్పే అని వాదించారు. తాజాగా  రేఖ కూడా ఆ యువతిదే తప్పు అని చెప్పుకొచ్చింది.

” నాకు తెలుసు.. జానీది తప్పు లేదని. అమ్మాయిదే తప్పు.  అనవసరంగా జానీ మీద నిందలు వేశారని నాకు అనిపిస్తుంది. నేను ఆడపిల్లనే.. ఒక ఆడపిల్లను ఇలా అంటారా అని అనుకున్నా.. ఆ అమ్మాయిదే తప్పు. జానీని అనవసరంగా  అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని అలా చేశారు.. ఇలా చేశారు అంటే  పాపేమి చిన్నది కాదు. రూమ్ కి తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్తున్నారో  తెలియకుండా ఉండడానికి. అన్ని చేసి నాలుగు ఏళ్ల తరువాత అలా చేశాడు.. ఇలా చేశాడు అని అంటే.. మరి ఇన్ని సంవత్సరాలు  ఏం చేసింది.

ఇంకా జానీలో మంచితనం ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నవాళ్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఏమో ఆమెను లవ్ చేసి ఉండొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ, తప్పు తన ఒక్కడి మీద వేయడం అనేది తప్పు. తప్పు ఇద్దరి మీద ఉంది. తీసుకెళ్తే ఇద్దరినీ లోపల వేయాలి. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేము.  జానీ ది తప్పు అయితే ఆ అమ్మాయిది కూడా తప్పే. ఇద్దరినీ జైల్లో పెట్టాలి. ఎన్నేళ్లు కష్టపడితే ఆ పేరు వస్తుంది. ఎంతమందికి  సలాంలు  కొడితే ఆ స్థాయి వచ్చింది.

Nitya Menen: నిత్యా ఇక నువ్వు మారావా.. అంత పొగరు పనికిరాదు

తనకన్నా 30 ఏళ్ళ అనుభవంతో  చెప్తున్నా.. వారికీ నచ్చినా నచ్చకపోయినా..  కాళ్లు పట్టి, సెల్యూట్ లు కొట్టి, నమస్కారం పెట్టి  అవన్నీ చేస్తే ఒక పాట వస్తుంది. ఆ పాటకు ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. కరెక్ట్ గా అతనికి నేషనల్  అవార్డు వచ్చే టైమ్ లో అలా చేస్తే మంచిదా.. ? అది ఒక ఆడపిల్ల మాట విని అలా చేయడం తప్పు కదా.. ? అంతమంది పెద్దవాళ్లు ఉండికూడా ఏం చేయలేకపోయారు అనేది నా బాధ.  ఆమె వచ్చి జానీని అడిగింది. తనను డ్యాన్స్ మాస్టర్ ను చేసింది అతనే. అన్ని తనకు నచ్చినట్లు చేయించుకొని.. ఒక స్టేజికి వచ్చాకా అతనిపై నింద వేస్తే అది జనాలు నమ్ముతున్నారు.

లక్కీగా ఆ యువతీపై ప్రేమ ఉంది కాబట్టే అవును నేను చేశాను అని ఒప్పుకున్నాడు. అది లేకపోతే ఏంటి నీ పరిస్థితి.. ? ఎన్నేళ్లు భయపెట్టి ఉంటాడు. సరే భయపెడితే.. మరి నాలుగో ఏడాది ఎలా పోలీసుల దగ్గరకు వెళ్ళావు. అంటే నీ అవసరం తీరిపోయింది అతడితో. నేమ్, ఫేమ్ , డబ్బు వచ్చేసరికి అతడితో అవసరం తీరిపోయింది. కార్డు ఇప్పించాడు, అవకాశాలు ఇప్పించాడు.. ఇప్పుడు అతనితో అవసరం ఏం ఉంది. అందుకే ఇలా చేసింది. ఏదిఏమైనా జానీ మీద నింద పడింది” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×