Jayam Ravi: జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒడిదుడుకులు లేని జీవితం ఎవరికి ఉండదు. ఎంత ధనవంతులు అయినా.. సెలబ్రిటీలు అయినా కష్టాలు రాకుండా ఉండవు. ఆ టైమ్ లోనే అసలు లైఫ్ ఏంటి.. నిజమైన స్నేహితులుబి ఎవరు అనేది తెలుస్తోంది. కొంతమంది ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు తాము భరించలేమని ప్రాణాలు తీసుకుంటారు. కానీ, ఇంకొంతమంది మాత్రం ఏది వచ్చినా నిలబడి నవ్వుతూ వాటితో పోరాడతారు. హీరో విశాల్ రెండో కేటగిరికి చెందుతాడు అని చెప్పొచ్చు.
ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యాన్ని ఎవరు కొనలేరు. ప్రస్తుతం విశాల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించని విశాల్.. ఈ మధ్య తన సినిమా మదగజరాజు సినిమా ఈవెంట్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే విశాల్.. అసలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాడు. దృఢంగా కొండలను అయినా పిండి చేసేంత కండబలం ఉన్న విశాల్.. కనీసం మైక్ పట్టుకోలేక వణికిపోయాడు. దీంతో అసలు విశాల్ కు ఏమైంది.. ? అని అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
Nitya Menen: నిత్యా ఇక నువ్వు మారావా.. అంత పొగరు పనికిరాదు
ఇక విశాల్ వైరల్ ఫీవర్ కు గురయ్యాడు.. ఆయనకు రెస్ట్ కావాలని అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించినా.. ఫ్యాన్స్ నమ్మలేకుండా ఉన్నారు. ఫీవర్ కే అలా అయిపోతారా.. ? ఇంకేదో జరిగిందనే అనుమానాలు తలెత్తాయి. కానీ, దానిమీద సరైన క్లారిటీ లేకపోవడంతో విశాల్ త్వరగా కోలుకొని నార్మల్ గా అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. విశాల్ కు ఇంత జరుగుతున్నా సెలబ్రిటీలు మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇండస్ట్రీలో ఒక హీరోకు ఆరోగ్యం బాగోకపోతే మిగతావారు ఇంటికి వెళ్లి పలకరించడమో.. లేక సోషల్ మీడియా ద్వారా జాగ్రత్తగా ఉండమని కోరడంతో చేస్తారు. కానీ, విశాల్ విషయంలో అదేమీ జరగలేదు. ఇక ఈ హీరో బయటకు వచ్చాక మాత్రం ఒక్కో హీరో అతని గురించి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న నటి ఖుష్బూ, ఆమె భర్త సుందర్.. విశాల్ ఆరోగ్యం గురించి స్పందించారు.
తాజాగా మరో హీరో విశాల్ హెల్త్ పై స్పందించాడు. అతనే కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి. ప్రస్తుతం ఆయన నటించిన కాదలిక్క నేరమిల్లై సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేసిన జయం రవి వరుసగా ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
Game Changer : బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైజ్ అలా ఎలా ఇస్తారు… టీజీ హైకోర్టు సీరియస్
తాజాగా ఒక ప్రెస్ మీట్ లో జయం రవి, విశాల్ హెల్త్ గురించి మాట్లాడుతూ.. ” విశాల్ చాలా మంచి వ్యక్తి. సినిమాలే కాకుండా బయట కూడా చాలామందికి సేవ చేశాడు. మరెంతోమందికి సహాయం చేశాడు. ప్రస్తుతం విశాల్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు బ్యాడ్ టైమ్ వస్తుంది. విశాల్ కూడా ఈ బ్యాడ్ టైమ్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను. వస్తాడని నమ్ముతున్నాను. ఆయన కోలుకొని తిరిగి మాములు స్థితికి వచ్చి అభిమానులను అలరించాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.