Nitya Menen: నిత్యా మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సావిత్రి, ఒక సౌందర్య.. ఆ తరువాత ఒక నిత్యా మీనన్ అని ప్రేక్షకులు చెప్పుకొస్తూ ఉంటారు. అందం, అభినయం ఉన్న ఈ నటి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను తప్ప.. ఏదో హీరోయిన్ ఉంది అనే సినిమాల్లో నటించలేదు. అందులోనూ నిత్యా నటనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆమె నటిస్తుంటే.. చూసేవారి కంటి నుంచి కన్నీళ్లు రావాల్సిందే.
అలా మొదలైంది సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కర్లీ హెయిర్ తో.. ముద్దుగా గలగలా మాట్లాడే నిత్యాను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి సినిమా మంచి హిట్ అందుకోవడంతో నిత్యా వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాలేదు. మొదటి సినిమా హిట్ అయ్యింది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా తన మనసుకు నచ్చిన సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది.
Rashmika mandanna: గాయపడ్డ రష్మిక.. అసలేమైందంటే..
సినిమాలో చిన్న పాత్ర అయినా అది ప్రాధాన్యం కలిగి ఉండాలని కోరుకొనే హీరోయిన్ నిత్యా మీనన్. అందుకే ప్రేక్షకులకు ఆమె అంటే ఎంతో ఇష్టం. కానీ, ఆమె ప్రవర్తనపై మాత్రం ఎప్పటికప్పుడు నెటిజన్స్ చిర్రుబుర్రులాడుతూనే ఉంటారు. వివాదాలు కొనితెచ్చుకోవడంలో నిత్యా ముందు ఉంటుంది. నిత్యాకు పొగరు అనే మాట ఇండస్ట్రీలో టాప్ లేచిపోతుంది. అందుకు కారణం ఆమె ప్రవర్తనే. అది ఆమె తన ఆత్మాభిమానం అంటుంది. కానీ, అది బయట నుంచి చూసేవారికి పొగరుగానే కనిపిస్తుంది. ఇండస్ట్రీలో నలుగురుతో బావుంటేనే నాలుగు కాలాలు కొనసాగుతారు.
మొదటి నుంచి నిత్యా కు పొగరు అని చాలామంది హీరోలు చెప్పుకొచ్చారు. సెట్ లో ఎవరితో మాట్లాడకుండా తన పని తానూ చేసుకునేది అంట. ఎవరైనా పలకరించినా అస్సలు మాట్లాడేది కాదట. హీరోలు అంటే లెక్కలేకుండా ఉండేదని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నిత్యా.. ప్రభాస్ ఎవరో తెలియదు అనేసింది. అప్పుడు ఆమెను ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రేంజ్ గా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికీ నిత్యా.. ఈ విషయంలో బాధపడుతూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆకు ఇండస్ట్రీ కొత్త. ఏ హీరో గురించి తెలియదు. ప్రభాస్ గురించి నాకప్పుడు తెలియదు. అదే విషయాన్నీ ఇంటర్వ్యూలో చెప్పాను. అదే నేను చేసిన తప్పు. ఆ తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారు. చాలా బాధపడ్డాను. కుంగిపోయాను. తెలియకుండా చేసినదానికి ఇప్పటికీ నన్ను ట్రోల్ చేస్తున్నారని ఆమె బాధపడింది. ఇక ఈ ఘటన తరువాత కూడా నిత్యాలో ఏ మార్పు రాలేదు.
Hrithik Roshan: ఇండస్ట్రీలో అత్యధిక భరణం ఇచ్చిన హీరోగా రికార్డ్.. ఎన్ని కోట్లంటే.?
సెట్ లో ఎవరికి మర్యాద ఇవ్వదు అని, పొగరుగా బిహేవ్ చేస్తుందని కొంతమంది హీరోలు కూడా నిత్యా గురించి చెప్పుకొచ్చారు. ఇక నిన్నటికి నిన్న కాదలిక్క నేరమిల్లై ఆడియో లాంచ్ లో కూడా నిత్యా ప్రవర్తనపై ట్రోల్స్ వస్తున్నాయి. హీరోలు, డైరెక్టర్స్ కు హాగ్ లు, ముద్దిలిచ్చి పలకరించిన ఆమె ఒక ఈవెంట్ ఆర్గనైజర్ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే కరోనా అని చెప్పి తప్పించుకుంది. అంత అంటరాని వాళ్లా..? అంత పొగరు ఎందుకు నీకు అంటూ ఏకిపారేస్తున్నారు.
నిత్యా ఇక నువ్వు మారావా.. అంత పొగరు పనికిరాదు.. ఇండస్ట్రీలో ఉంటున్నావ్.. అందరిని మంచిగా చూడాలి. నటన ఒక్కటే నీకు గౌరవం తీసుకురాదు .. నీ ప్రవర్తన కూడా బావుండాలి అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇకనుంచైనా ఈ చిన్నది తన బిహేవియర్ మార్చుకుంటుందో లేదో చూడాలి.