E-Paper
Advertisement

Pawan Kalyan: అనంత్ అంబానీ శుభ్ ఆశీర్వాద్ వేడుక.. బాబాయ్- అబ్బాయ్ హంగామా

Pawan Kalyan: అనంత్ అంబానీ శుభ్ ఆశీర్వాద్ వేడుక.. బాబాయ్- అబ్బాయ్ హంగామా

Pawan Kalyan: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. రాధికా మర్చంట్ తో అతడి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.

ముంబై మొత్తం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మునిగితేలుతోంది. ఇక ఈ రాత్రి వీరి రిసెప్షన్ ఘనంగా జరుగుతుంది. శుభ్ ఆశీర్వాద్ వేడుక అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెళ్ళికి రానివారు.. రిసెప్షన్ కు హాజరవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో రిసెప్షన్ వేదిక కళకళలాడుతూ కనిపిస్తుంది.

ఇక ఈ రిసెప్షన్ కు కొత్త అందాన్ని తీసుకొచ్చారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న పవన్.. కొద్దిసేపటి క్రితమే శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయ్యారు. ఇక ఆయన దీక్షలో ఉండడంతో అవే దీక్షా వస్త్రాలతో కనిపించారు. అక్కడ రాజకీయ నేతలను పలకరించిన పవన్.. అబ్బాయ్ రామ్ చరణ్ ను సైతం కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంకోపక్క సీఎం చంద్రబాబు సైతం సతీమణి నారా భువనేశ్వరితో హాజరయ్యారు. కొద్దిసేపటిలో నూతన వధూవరులను వీరు ఆశీర్వదించనున్నారు. వీరు  కాకుండా టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు వెంకటేష్, రానా, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×