BigTV English

CM Revanth Reddy – Allu Arjun : అంత ఈజీగా అబద్ధాలు ఎలా ఆడుతున్నావ్ అన్న

CM Revanth Reddy – Allu Arjun : అంత ఈజీగా అబద్ధాలు ఎలా ఆడుతున్నావ్ అన్న

CM Revanth Reddy – Allu Arjun : న్యాయం గెలుస్తుంది అన్నమాట నిజమే కానీ గెలిచేదంతా న్యాయం కాదు అని శ్రీశ్రీ చెప్పినట్లు చెప్పిన మాటలు అల్లు అర్జున్ కేసు కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. అసలు జరిగిన విషయం ఏమిటంటే డిసెంబర్ 5న పుష్ప2 సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. రిలీజ్ కి ఒక రోజు ముందే కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చారు. ఆ తరుణంలో అల్లు అర్జున్ వచ్చాడు అని తెలియగానే ప్రేక్షకులు మాత్రమే కాకుండా అభిమానులందరూ కూడా థియేటర్ కి వచ్చేసారు. ఒక్కసారిగా అందరూ రావడంతో తొక్కిసిలాట జరిగింది. ఈ తరుణంలో రేవతి అనే ఒక మహిళ మరణించారు. అంతేకాకుండా తన కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రి వెంటిలేటర్ పైన ఉన్నారు.


ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. సినిమా జరుగుతున్న టైం లోనే ఒక తల్లి బిడ్డ మరణించారు అని అల్లు అర్జున్ కి చెప్పి, మీరు దయచేసి వెళ్ళిపోండి అని పోలీసులు అడిగినట్లు.. దానికి అల్లు అర్జున్ నిరాకరిస్తూ సినిమా చూసే వెళ్తాను. అని పోలీసులతో చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు బట్టి చూస్తుంటే ఇలా చనిపోయారు అనే విషయం అల్లు అర్జున్ కు వెంటనే తెలిసింది. కానీ అల్లు అర్జున్ రెండు రోజుల తర్వాత ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. సినిమా అయిపోయిన తరుణంలో ఆ మరుసటి రోజు ఉదయం తను ఇలా చనిపోయింది అని తనకు తెలిసింది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ మాట ప్రకారం ప్రీమియర్ షోలో జరిగిన ఘటన తనకు తర్వాత రోజు తెలిసింది అని చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చాలా ఈజీగా అబద్ధం చెప్పేసాడు అని చాలామందికి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏదైనా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇకపై టికెట్ రేట్లపై హైక్ ఉండదు. బెనిఫిట్ షోస్ కూడా ఉండవు అని రేవంత్ రెడ్డి తెలిపారు. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇది జరగని పని అంటూ చెప్పుకోచ్చారు. అంతేకాకుండా అజారుద్దీన్ ఓవైసీ కూడా అల్లు అర్జున్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తీరు మాత్రం ఇప్పుడు విపరీతమైన అసంతృప్తికి గురిచేస్తుంది. మొదట అల్లు అర్జున్ అరెస్టు చేసిన వెంటనే చిరంజీవిలాంటి వాళ్లు కూడా రంగంలోకి దిగి బెయిల్ ఇప్పించారు. కానీ వెనక్కి జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ తప్పు క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది కేవలం అల్లు అర్జున్ ని అభిమానించే వాళ్ళే తప్ప, మిగతా వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి మాటలకు సపోర్ట్ చేస్తున్నారు అనేది వాస్తవం.


Also Read : Akbaruddin Owaisi – Pushpa 2: తొక్కిసలాటలో మహిళ చచ్చిపోయిందా? అయితే నా సినిమా సూపర్ హిట్ అయినట్టే

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×