IRCTC Online Tticket Booking: దేశ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది ట్రైన్ జర్నీనిని ఇష్టపడుతారు. రైల్లో ప్రయాణించాలంటే కచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ప్రయాణీకులు పలు రకాల యాప్స్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇతర యాప్స్ తో పోల్చితే భారతీయ రైల్వే సంస్థకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్ ద్వారా ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. రైల్వే ప్రయాణీకులు మరింత మెరుగ్గా టికెట్లు బుక్ చేసుకునేందుకు IRCTC eWalletను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు వినియోగదారులకు చాలా లాభాలున్నాయి.
IRCTC eWalletతో ఎన్నో లాభాలు
IRCTC eWallet ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల పలు ఛార్జీల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గేట్ వే ఛార్జీలు ఉండవు. ఆన్ లైన్ వాలెట్ టాప్ అప్, నిర్దిష్ట బ్యాంక్ నెట్ వర్క్ మీద ఆధారపడి ఉండదు. టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజీగా రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC eWalletని ఉపయోగించడం వల్ల కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. IRCTC eWalletకు సంబంధించి లావాదేవీల కోసం పాస్ వర్డ్ లేదంటే పిన్ నెంబర్ ను అందిస్తుంది. ప్రతి టికెట్ బుకింగ్ కు సంబంధించి ఈ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంకు సర్వర్ పని చేయని సమయంలో ఈవ్యాలెట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున అవకాశం ఉంటుంది. IRCTC eWalletలో రూ. 100 నుంచి రూ. 1,000 వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
IRCTC eWalletతో టికెట్ల బుకింగ్ ఎలా?
IRCTC eWallet ద్వారా సింపుల్ గా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ముందుగా https://www.irctc.co.in ఓపెన్ చేయాలి. లాగిన్ కావాలి.
⦿ తొలిసారి మీరు IRCTC ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి.
⦿ ‘IRCTC ఎక్స్ క్లూజివ్’ బటన్ కింద ఉన్న ‘IRCTC eWallet’ మీద క్లిక్ చేయాలి.
⦿ IRCTC లావాదేవీ పిన్ నెంబర్ ను ఎంటర్ చేసి IRCTC అకౌంట్ లోకి ఎంటర్ కావాలి.
⦿ ఆ తర్వాత మీరు IRCTC హోమ్ పేజీలోకి వెళ్తారు.
⦿ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలతో మళ్లీ లాగిన్ కావాల్సి ఉంటుంది.
⦿ ‘IRCTC ఎక్స్ క్లూజివ్’ పై క్లిక్ చేసి, దాని eWalletలో పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
⦿ ఆ తర్వాత ‘IRCTC eWallet డిపాజిట్’పై క్లిక్ చేసి, UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి చెల్లింపులు కొనసాగించే అవకాశం ఉంటుంది.
⦿ ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత IRCTC వెబ్ సైట్ లో eWallet ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఓర్నీ.. రైలు కింద పడ్డా బతికేశాడు, అదెలా? ఇదిగో ఈ వీడియో చూడండి!