
Comedian Ali : హాస్యం అనేది ఒక కళ.. మన మాటలతో.. చేష్టలతో ఒకరిని నవ్వించడం అంత ఈజీ కాదు. అయితే కొందరు టాలీవుడ్ కమెడియన్లు స్క్రీన్ పై కనిపిస్తే చాలు మాట్లాడినా ..మాట్లాడకపోయినా ఆడియన్స్ విరగబడి నవ్వుతారు. వాళ్లు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలా ఉంటుంది మరి. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ కమెడియన్స్ లో తన ఎక్స్ప్రెషన్స్ తోటే కడుపుబ్బ నవ్వించగలిగే యాక్టర్ అలీ. కొన్ని సంవత్సరాలుగా వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా రాణించిన నటుడు అలీ.
అలీ టాలీవుడ్ లో చాలా సినిమాలు నటించాడు .కొన్ని సినిమాల్లో అలీ పాత్ర సినిమాలో చాలావరకు కనిపిస్తుంది కానీ కొన్ని సినిమాల్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కనిపించింది కాసేపైనా కానీ అలీ కామెడీ మాత్రం ఓ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంది.స్క్రీన్ పైన కనిపించింది కాస్త సేపైనా ఆ చిత్రంలో అలీ ఇంపాక్ట్ గట్టిగానే కనబడుతుంది. మరి అలాంటి మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
పోకిరి:
మహేష్ బాబు మాటల తూటాలు పేల్చిన చిత్రం పోకిరి. ఇందులో మహేష్ బాబు డైలాగ్స్ ఇప్పటికీ మీమర్స్ కి ఫుల్ ఎనర్జీ ఇస్తాయి. మరి ఈ మూవీలో అలీ ఒక బెగ్గర్ పాత్ర లో కనిపిస్తాడు. బ్రహ్మీ సాఫ్ట్వేర్ కు ఓ రేంజ్ లో బెగ్గర్ పవర్ చూపిస్తాడు అలీ. ఇందులో అలీని కామెంట్ చేశాడు అని బ్రహ్మానందం వెనుక వేణుమాధవ్ తో కలిసి బిచ్చగాళ్లు క్యూ కట్టే సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ మూవీలో క్యారెక్టర్ కి అలీ విమర్శకుల దగ్గర కూడా ప్రశంసలు అందుకున్నాడు.

రేస్ గుర్రం:
రేసుగుర్రం మూవీలో అన్న పెళ్లి తప్పించడానికి ఓ చిన్న అబద్ధం చెబుతాడు అల్లు అర్జున్. ఆ అబద్దాన్ని ప్రూవ్ చేసే డాక్టర్ బాలి క్యారెక్టర్ లో అలీ కామెడీ ఎక్సలెంట్ గా ఉంటుంది. కాస్త నత్తి నత్తిగా మాట్లాడుతూ ..సీరియస్ విషయాన్నీ కూడా ఎంతో కామెడీ యాంగిల్ లో చెబుతూ అలీ ఈ సీన్ ని బాగా పండించాడు.

సూపర్:
నాగార్జున సూపర్ మూవీలో అప్కమింగ్ ఆర్టిస్ట్ గా అలీ నటన ఎక్స్ట్రాడినరీ. దొంగల్ని గుర్తు పడతాను అంటూ పోలీసుల దగ్గర బుక్ అయిపోయిన అలీ.. పోలీస్ స్టేషన్ లో ట్రూత్ మిషన్ దగ్గర చేసే కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో అలీ, బ్రహ్మానందం మధ్య డిస్కషన్ కడుపుబ్బ నవ్విస్తుంది.

ఖలేజా:
ఖలేజా మూవీలో అనుష్క దెబ్బకి ఎడారిలో తిరుగుతున్న సునీల్, మహేష్ కు ఎడారిలో ఒయాసిస్ లో దొరికిన మొక్కల పరిశోధకుడు టామ్ క్రూజ్ క్యారెక్టర్ లో అలీ నటన అద్భుతంగా ఉంటుంది. ఇక అనుష్క గురించి అతను చెప్పే డైలాగ్స్.. పచ్చబొట్ల సీన్ బాగా ఫన్నీ గా ఉంటాయి.