
Virat Kohli : వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ రికార్డులను తిరగరాశాడు . న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించాడు . ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సెంచరీలు నమోదు చేశాడు. అతను తన క్రికెట్ ఆరాధ్య దైవం ముందు ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా 113 బంతుల్లో 117 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
వన్డే వరల్డ్ కప్ ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచ కప్ లో 673 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 711 పరుగులు చేశాడు.
.
.
.