BigTV English

Jailer 2 Update: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జైలర్ 2’ అప్డేట్‌ అదిరిపోయింది.. వరుస సినిమాలతో రజిని బిజీ బిజీ..!

Jailer 2 Update: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జైలర్ 2’ అప్డేట్‌ అదిరిపోయింది.. వరుస సినిమాలతో రజిని బిజీ బిజీ..!

Jailer 2 Update: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’తో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాకి ముందు వరుస ఫ్లాపులతో చాలా సఫర్ అయ్యారు. కానీ జైలర్ మూవీ మాత్రం సూపర్ డూపర్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. దీంతో తలైవా ఈజ్ కంబ్యాక్ అంటూ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఈ సినిమా కేవలం హిట్ కావడమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దులిపేసింది.


దీంతో అప్పటి వరకు ఆకలిమీదున్న రజినీ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఇక ఈ మూవీకి సీక్వెల్‌ కూడా వస్తుందంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’ని అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కంప్లీట్ అయ్యాక త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: జైలర్ 2 టైటిల్ ఇదే.. పోలా.. అదిరిపోలా.. ?


ఈ సినిమాలో రజినీ కాంత్‌కు, కమెడియన్ యోగి బాబుకు మధ్య ఫుల్ కామెడీ ట్రాక్‌ను దర్శకుడు సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి యోగిబాబు తాజాగా ఓ అప్డేట్ అందించి రజినీ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు. జైలర్ 2 మూవీలో కూడా తాను నటిస్తున్నట్లు తెలిపాడు. దర్శకుడు నెల్సన్ దిలిప్ కుమార్ ఈ సీక్వెల్‌లో తన పాత్రను చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జైలర్ మూవీలో కనిపించిన మిర్నా మీనన్ ‘జైలర్ 2’లో కూడా నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు.

ఈ అప్డేట్‌తో సినీ ప్రియులు అండ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇకపోతే రజినీ ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ‘వెట్టయాన్’ సినిమా ఒకటి. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో సినిమా లోకేష్ కనగరాజ్‌తో తీస్తున్నాడు. అదే ‘కూలి’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఈ సినిమాలతో పాటుగా మారి సెల్వరాజ్ కథ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయనట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×