BigTV English

Buddy Trailer: అల్లు శిరీష్ ‘బడ్డీ’ టైలర్ రిలీజ్.. టెడ్డీబేర్ ఫైట్స్ ఏమున్నాయ్ బాసు

Buddy Trailer: అల్లు శిరీష్ ‘బడ్డీ’ టైలర్ రిలీజ్.. టెడ్డీబేర్ ఫైట్స్ ఏమున్నాయ్ బాసు

Buddy Trailer: అల్లు అల్లు శిరీష్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఫుల్ క్రేజ్ అందికున్నాడు. ఆ తర్వాత ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, గౌరవం వంటి సినిమాలు చేశాడు. అయితే ఇందులో ఏ ఒక్క సినిమా కూడా అల్లు శిరీష్‌కి మంచి స్టార్డమ్ అందించలేదు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంటుంది.


అయితే ఈ సారి పక్కాగా ఒక మంచి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ‘బడ్డి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞనవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిషా రాజేష్ సింగ్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా తమ అందంతో ఆకట్టుకోనున్నారు.

Also Read: టెడ్డీ, బడ్డీ వేరు వేరని అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్.. తగ్గేదేలే అంటున్న ‘బడ్డీ’ ట్రైలర్!


ఈ మూవీ ఆగస్టు 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో మేకర్స్ అదిరిపోయే ఆఫర్ అందించారు. ఈ మేరకు బడ్డి మూవీ టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో అల్లు శిరీస్‌తో పాటు మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. సింగిల్ స్క్రీన్‌లో అయితే రూ.99, అదే మల్టీప్లెక్స్‌లో అయితే రూ.120గా నిర్ణయించారు.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ మరో అప్డేట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా బడ్డి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో అల్లు శిరీష్ మాస్ లుక్ అదిరిపోయింది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టెడ్డీబేర్‌తో అతడికుండే అనుబంధం చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. మొత్తం ఫైట్ సీక్వెన్సెస్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూడాలి మరి ఈ సినిమా అయినా అల్లు శిరీష్‌కి మంచి స్టార్డమ్ అందిస్తుందో లేదో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×