BigTV English

Court Collections : బాక్సాఫీస్ ఊచకోత.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Court Collections : బాక్సాఫీస్ ఊచకోత.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Court Collections : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలంటే… భారీగా కలెక్షన్స్ కూడా ఉంటాయని అందరూ అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ లో వచ్చిన సినిమాలే ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఉదాహరణగా హనుమన్ సినిమా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో సినిమా వచ్చేలా కనిపిస్తుంది. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన కోర్టు మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.


థియేటర్లలోకి వచ్చినా మొదటి రోజునే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటు కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్షన్స్ ని రాబట్టిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కోర్ట్ మూవీ స్టోరీ.. 


న్యాయశాస్త్రం, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ సామాన్యులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ హీరో నాని సమర్పణలో బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల వ్యయం తో నిర్మించారు. కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల వంటి వాళ్లు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.. హోలీ పండుగ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కథ ఏంటంటే… చందు ఇంట‌ర్ ఫెయిల్ అవుతాడు. పార్ట్‌ టైమ్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఓ ఇంటి ద‌గ్గర వాచ్‌ మెన్‌ గా ప‌నిచేసే చందుకి పెద్దింటి అమ్మాయి.. ఇంట‌ర్‌ చ‌దువుతున్న జాబిలి కి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఆ విష‌యం కాస్త జాబిలి ఇంట్లో తెలుస్తుంది. ఎప్పుడూ కుటుంబం పరువు, స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగ‌ప‌తి కోపంతో ర‌గిలిపోతాడు. ఏం జ‌రిగిందని వెన‌కా ముందు ఆలోచించ‌కుండా పోక్సో చట్టంతోపాటు, ఇత‌ర క‌ఠిన‌మైన సెక్షన్ల కింద చందుపై కేసు పెట్టిస్తాడు.

ఆ ప‌రిణామం ఏ త‌ప్పూ చేయ‌ని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? చివరికి ఆ కేసు నుండి ఎలా బయటపడతాడు అన్నది ఈ సినిమా స్టోరీ.. ఈ మూవీలో ఎవరి పాత్రకు వాళ్ళు 100కు 100 శాతం న్యాయం చేయడం వల్లే సినిమా భారీ సక్సెస్ ని అందుకుందని చెప్పవచ్చు..

కోర్ట్ మూవీ కలెక్షన్స్.. 

ఈ సినిమా రిలీజ్ అయిన టైం కరెక్ట్ గానే ఉంది అందుకే ఈ సినిమాకు భారీగా వసూలు వచ్చి పడుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయి పది రోజులు పూర్తయినా కూడా ఇంకా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.50.80 కోట్లు వసూల్ చేసింది. పదో రోజైన ఆదివారం కూడా రూ.4కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా లాంగ్​రన్​లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్.

ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాలలో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా భారీ విషయాన్ని అందుకుంది. ఇదే దూకుడుతో ముందుకెళ్తే త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని నాని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

ఇక నాని సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. శైలేష్ కొలను కాంబినేషన్లో హిట్ 3 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో దసరా మూవీకి సీక్వెల్గా ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×