Hero Suhas:ప్రముఖ యంగ్ హీరో సుహాస్ (Suhas ) విభిన్నమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’.. హరీష్ నల్ల నిర్మాణ సారధ్యంలో.. మాళవిక మనోజ్ (Malavika Manoj) తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అనిత హస్సానందని, అలీ, మొయిన్, బబ్లూ పృథ్వీరాజ్ కీలకపాత్రలో వస్తున్న చిత్రం ఇది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. “మన కథ బొమ్మరిల్లు సినిమా కాదు.. రక్త చరిత్ర” అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ రౌడి క్యారెక్టర్, హీరో అమాయకపు క్యారెక్టర్ అన్నట్టుగా అనిపిస్తోందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
అసహనం వ్యక్తం చేసిన హీరో..
మొత్తానికి అయితే టీజర్ మాత్రం అధ్యంతం నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో హీరో సుహాస్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి దాని మీదే ధ్యాస.. నాకు ఈ టార్చర్ ఏంటి? అంటూ కామెంట్లు చేయడం జరిగింది. అసలు విషయంలోకెళితే.. మీరు ఇప్పుడు హీరోగా ఎదిగిన తర్వాత యాడ్స్ కూడా చేస్తున్నారు. అటు యాడ్స్ కి ఇటు సినిమాకి ఒకే తరహా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంట కదా.. ? నిజమేనా..?ఎంత తీసుకుంటున్నారు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి సుహాస్ ఎవరైనా సరే నటన బాగుంది అని అంటారు. కానీ మీరు ఎక్కడ తయారయ్యారు.. ఎక్కడికి వెళ్ళినా మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నంబర్స్ లోనే తీసుకుంటున్నాను. అది పెద్ద అమౌంట్ కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు సుహాస్. ఏదేమైనా సుహాస్ కి సంబంధించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సుహాస్ కెరియర్..
సుహాస్ విషయానికి వస్తే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి, 2010లో విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక తర్వాత మొదటిసారి హీరోగా నటించిన చిత్రం ‘కలర్ ఫోటో’. ఉత్తమ తెలుగు చిత్రంగా ఈ సినిమాకి జాతీయ పురస్కారం కూడా లభించింది. సుహాస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందినవారు. 1990 ఆగస్టు 19న జన్మించారు. ఈయన అసలు పేరు సుహాస్ పాగోలు. కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈయన.. లలిత అనే అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నారు. ఇకపోతే కలర్ ఫోటో సినిమాలో నటించక ముందు ప్రతిరోజు పండగే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, డియర్ కామ్రేడ్ , ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మజిలీ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు హీరో గానే కాకుండా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ సినిమాలో విలన్ గా కూడా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. త్వరలో ఆనందరావు అడ్వెంచర్స్, కేబుల్ రెడ్డి వంటి చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. అలా సినిమాలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు సుహాస్.
Jaat Movie Trailer: Jaat Movie Trailer : ఈ లంకలో అడుగు పెట్టే భగవంతుడే ఈ జాట్..!