BigTV English

CourtStateVsANobody : ఇండస్ట్రీ నుంచి అడ్వాన్సులు రెడీ, కానీ రెండో సినిమా చేసేది అక్కడే

CourtStateVsANobody : ఇండస్ట్రీ నుంచి అడ్వాన్సులు రెడీ, కానీ రెండో సినిమా చేసేది అక్కడే

CourtStateVsANobody : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అలానే వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంటుంది. చాలామంది దర్శకులు మొదటి సినిమాతో హిట్టు కొట్టి ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. మొదటి సినిమా హిట్ అవడం ఎంత ఇంపార్టెంట్ రెండవ సినిమా కూడా హిట్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. అయితే మొదటి సినిమా హిట్ రాగానే చాలామంది ప్రొడ్యూసర్లు ఆ దర్శకుడు కోసం క్యూ కడుతూ ఉంటారు. అటువంటి తరుణంలోని ఆచితూచి ప్రతి దర్శకుడు అడుగులు వేయాల్సి వస్తుంది. అవకాశాలు వస్తున్నాయని అడ్వాన్సులు తీసుకుంటే బుక్ అయిపోవడం ఖాయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది దర్శకులు మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా కోర్టు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ జగదీష్.


మొదటి సినిమా బ్లాక్ బస్టర్

కోర్టు సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాని ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి చేసిన సాహసం మాటల్లో చెప్పలేనిది. తాను నటించిన సినిమాను కూడా రిస్క్ లో పెట్టి ఈ సినిమాను నాని ప్రమోట్ చేశాడు. ఈ సినిమా చూడండి ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే నా సినిమాకు మీరు రావద్దు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే రామ్ జగదీష్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక మంచి పాయింట్ తీసుకుని చాలా ఆసక్తికరంగా మలిచాడు. ముఖ్యంగా కోర్టులో జరిగే డ్రామా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఒక సినిమా బాగుంటే చూస్తారు అనడానికి నిదర్శనం ఈ కోర్టు సినిమా.


వరుస అవకాశాలు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కొట్టిన వెంటనే చాలా ప్రొడక్షన్ హౌస్ నుంచి అడ్వాన్సులు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. ఇక రామ్ జగదీష్ కి కూడా ఇండస్ట్రీ నుంచి అడ్వాన్సులు రెడీగా ఉన్నాయి. కానీ తన రెండవ సినిమా కూడా నాని బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలోనే చేయబోతున్నారు. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమా చేసిన తర్వాత వెంకట్ బోయినపల్లి బ్యానర్లో రామ్ జగదీష్ 3వ సినిమాను చేసే ప్లాన్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి ఇంకే బ్యానర్ కి రామ్ కమిట్మెంట్ ఇవ్వలేదు. గతంలో వెంకట్ బోయినపల్లి నాని నటించిన శ్యాం సింగరాయ్ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

Also Read : fauji imanvi : పాకిస్తానీ కాదు అని అబద్ధం చెప్పిన ప్రభాస్ బ్యూటీ, పాత పోస్ట్ వైరల్

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×