fauji imanvi : ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఎవరు ఊహించలేని పరిస్థితి. కాశ్మీర్ ను పర్యటించడానికి వెళ్లిన భారతీయులపై జరిగిన పెహల్గాం ఉగ్రవాది దాడి యావత్ దేశాన్ని కలచివేసింది. ప్రస్తుతం భారతీయుల రక్తం మరుగుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి పడిగాపులు కాస్తుంది. ఈ తరుణంలో చాలామంది తెలుగు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ అంతా కూడా ఈ దుర్ఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీస్ దీనిపై స్పందించారు. ఇకపోతే పాకిస్తానీ హీరోయిన్ అయినా ఇమాన్వి ను బ్యాన్ చేయాలి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు వచ్చిన మరుక్షణమే ఇమాన్వి స్వయంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు.
లెటర్ సారాంశం
నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో ఇప్పటి వరకు ఏ విధంగానూ సంబంధం కలిగి లేరు. ఇది మరియు అనేక ఇతర అబద్ధాలు ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ప్రయోజనం కోసం ఆన్‌లైన్ ట్రోల్‌లచే కల్పించబడ్డాయి.ముఖ్యంగా నిరుత్సాహకరమైన విషయం ఏమిటంటే, చట్టబద్ధమైన వార్తా సంస్థలు, జర్నలిస్టులు మరియు సోషల్ మీడియాలో ఉన్నవారు తమ మూల విషయాలను పరిశోధించడంలో విఫలమయ్యారు. మరియు బదులుగా ఈ అపవాదు ప్రకటనలను పునరావృతం చేశారు.నేను హిందీ, తెలుగు, గుజరాతీ మరియు ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్. నేను లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో జన్మించాను, నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు యువతగా వలస వచ్చారు. వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు. USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటి గా, కొరియోగ్రాఫర్‌గా మరియు నర్తకిగా కళారంగంలో వృత్తిని కొనసాగించాను.
Also Read : Sekar Mastar : జానుతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. నేను చేసిన తప్పు అదే..?
పాత స్టోరీ బయటకు తీశారు
ఇమాన్వి అలా చెప్పిన తర్వాత చాలామంది తప్పుగా కథనాలు ప్రచురించామని అనుకున్నారు. కానీ కొంతమంది ఇక్కడితో వదల్లేదు ఆమె పాత పోస్టులను తవ్వి తీశారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా మదర్ ఇండియా మా ఫాదర్ పాకిస్తాన్ అనే సారాంశం ఆ ఫోటోలు ఉంది. దీనితో చాలామంది ఇమాన్వి ను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది ప్రభాస్ ని కూడా తప్పుపడుతున్నారు. ఇక దీని గురించి మళ్ళీ ఇమాన్వి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో ఎదురు చూడాలి.
Also Read: Nani : నేను సూర్యకు పోటీ కాదు, మీరు ఆ రోజుని మా సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవాలి