Big Stories

Cyber Fraud in the name of Sitara: మహేష్ బాబు కూతుర్ని కూడా వదలని సైబర్ కేతుగాళ్ళు.. జరభద్రం!

sitara latest news

Cyber Fraud in the Name of Sitara: సైబర్ నేరాల గురించి మనకు తెలియనిదేమీ కాదు. తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, లింక్డ్ మెసేజ్ లు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా.. సైబర్ నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అమాయక ప్రజలే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకత్వం, అవసరాలు, బలహీనతలే పెట్టుబడిగా చేసుకుని.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఎంతోమంది సైబర్ నేరగాళ్ల మాయవలలో పడి.. ఉన్నదంతా సమర్పించుకున్నారు.

- Advertisement -

స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. సైబర్ నేరాలు మరింత పెరిగాయి. ప్రజల్ని మోసం చేసేందుకు ఏ ఒక్క మార్గాన్నీ వదలడంలేదు. సోషల్ మీడియాల నుంచి, ఓటీపీ పేరుతో, గిఫ్ట్ వచ్చిందనో.. మొబైల్ నంబర్లకు లింకులు పంపి.. దానిని క్లిక్ చేయడంతోనే వారి ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. అమ్మాయిల పేరుతో రిక్వెస్ట్ లు త్వరగా పడిపోతారని భావించి.. అదే దారిని ఎంచుకున్నారు కేటుగాళ్లు. సెలబ్రిటీల పేరుతోనూ మోసం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ సెలబ్రిటీ కూతురి పేరుతోనే మోసానికి తెరతీశారు.

- Advertisement -

Read More : ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరునే వాడేసుకున్నారు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ.. నయా మోసానికి తెరలేపారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి.. నగదును కాజేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. మహేష్ బాబు టీమ్ రంగంలోకి దిగింది. సితార పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా.. సైబరాబాద్ పోలీసులకు మహేష్ టీం ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో సితార పేరుతో ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్లు, రిక్వెస్టులకు స్పందించవద్దని మహేష్ టీం అభిమానులకు సూచించింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా నుంచి వస్తున్న ఇలాంటి రిక్వెస్టులపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి బరిలో నిలిచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కు వచ్చింది. మహేష్ అభిమానులంతా.. ఈ సినిమాను మరోసారి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తుంటే.. సినిమాలో ఉన్న కొన్ని సీన్లపై మీమర్స్ మీమ్స్ చేసి.. వైరల్ చేస్తున్నారు. ఒక సీన్ లో బీడీ వెలిగించుకునేందుకు అగ్గిపుల్ల అంటుకోకపోవడంతో.. లైటర్ వాడితే సరిపోయేదిగా అంటూ.. జోకులు పేలుస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో రాజమౌళితో మహేష్ సినిమాను ప్రకటించినా ఇంతవరకూ అప్డేట్ లేదు. దీంతో మహేష్ నెక్ట్స్ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News