Big Stories

Guntur Kaaram OTT Release: నెల తిరక్క ముందే ఓటీటీలోకి ‘గుంటూరు కారం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahesh Babu’s ‘Guntur Kaaram’ released on 9th February in Netflix: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -

దీంతో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. ఇట్టే వైరల్ అయిపోయేది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ మూవీ విడుదలైంది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఒకే తరహాలో సినిమాలు తీస్తున్నారని నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకుంది. ఇక ఎన్ని విమర్శలు చేసినా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్‌లో వచ్చాయి.

ముఖ్యంగా ఈ మూవీకి మహేష్ బాబు డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా స్క్రీన్‌పై మహేష్ బాబు ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయలేదని అభిమానులు సంతోషించారు. అంతేకాకుండా ఇందులో మహేష్‌తో శ్రీలీల కూడా ఓ రేంజ్‌లో దుమ్ము దులిపేసింది.

READ MORE: Guntur Kaaram: ‘గుంటూరు కారం’లో మార్పులు.. ఈ సీన్లనే యాడ్ చేస్తున్నారంట..?

ఇక ఈ మూవీ థియేటర్లలో రిలీజైన సమయంలోనే ‘హనుమాన్’ కూడా రిలీజై మంచి టాక్ అందుకుంది. దీంతో గుంటూరు కారం మూవీ పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు ఆడియన్స్ పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో వారికో గుడ్‌న్యూస్ అందింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా నెలరోజులలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

ఈ మూవీ కోసం ఎదురుచూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుంటూరు కారం’ మూవీ ఫిబ్రవరి 8 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ కూడా సోషల్ మీడియాలో స్పెషల్‌గా చెప్పుకొచ్చింది.

‘రాయల్ సత్యంలాగా బ్లాక్ అండ్ వైట్ కాదు.. రౌడీ రమణలాగా సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్’ అంటూ రమణ గురించి స్పెషల్‌గా చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుందని ఈ మేరకు ప్రకటించింది.

READ MORE: Guntur kaaram: ‘గుంటూరు కారం’ కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతంటే.?

అయితే జనవరి 12 రిలీజ్ అయిన ఈ మూవీ నెల రోజులలోపే ఓటీటీలో స్ట్రీమ్ అవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతోనే ఇంత త్వరగా స్ట్రీమింగ్‌కు వచ్చిందని.. లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాతే ఓటీటీలోకి వచ్చేదని చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News