Daaku Maharaj Collection : టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వయసు పెరుగుతున్నా కూడా కుర్ర హీరోల తో పోటీ పడుతున్నాడు.. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే, మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం లో వచ్చిన బాలయ్య మూవీ డాకు మహారాజ్.. ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను అందుకుంది.. ఇప్పుడు ఏడు రోజులకు ఎన్ని కోట్లు అందుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలయ్య సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో చెప్పానక్కర్లేదు. ఆడియన్స్ తో పాటు మామూలు ఆడియన్స్ ని కూడా ఆయన సినిమాలతో మెప్పిస్తాడు. అందుకే బాలయ్య సినిమాల కు ఈ అమ్మ క్రేజ్ ఉంటుంది. ఈమధ్య సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. డాకు మహారాజు కూడా అంతకుమించి రికార్డులను బ్రేక్ చేసింది. మౌత్ టాక్ తో సంబంధం లేకుండానే మరోవైపు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీ మొదటి రోజే 56 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత రోజు నుంచి ఓపెనింగ్స్ తగ్గకుండా కలెక్షన్స్ను వసూల్ చేస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.. ఇక ఏడు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
డాకు మహారాజ్ ఏడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ ఓపెనింగ్ రాబట్టిన సినిమా ఈ డాకు మహారాజ్. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. నాలుగు రోజు ల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఆరో రోజు తగ్గకుండా 129 కోట్లు వసూల్ చేసింది. ఇక ఏడో రోజు కూడా అంతకు మించి తగ్గకుండా 140 వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. కూడా దీనిపై డాకు మహరాజ్ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.. ఇక ఇదే జోరులో మూవీ రన్ అయితే మాత్రం 200 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. డాకు మహారాజ్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 మూవీ చేయబోతున్నారు.