E-Paper
Advertisement

OTT Movie : దైవ సేవ అంటూ, అమ్మాయిలతో ఏకాంత సేవ… ఆ మందిరంలో ఆడవాళ్ళు అడుగుపెడితే అంతే సంగతులు

OTT Movie : దైవ సేవ అంటూ, అమ్మాయిలతో ఏకాంత సేవ… ఆ మందిరంలో ఆడవాళ్ళు అడుగుపెడితే అంతే సంగతులు
Advertisement

OTT Movie : 18వ శతాబ్దం చివరి దశలో జరిగే ఒక స్టోరీతో వచ్చిన మూవీ, థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దేవుడి పేరు చెప్పుకొని, ఆ ముసుగులో జరిగే దురాచారాలను కళ్ళకు కట్టినట్లు ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘మహారాజ్‘ (Maharaj). 2024 లో విడుదలైన మహారాజ్ మూవీకి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించారు. YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ మూవీలో జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలిని పాండే, శర్వరితో నటించారు. ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకొని, ఆ ప్రాంతానికి రాజుగా ఉండే ఒక వ్యక్తి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

18 శతాబ్దంలో గుజారాత్ లోని వైష్ణవ దంపతులకు కర్శన్ దాస్ అనే వ్యక్తి  జన్మిస్తాడు. ఇతడు అందర్నీ ప్రశ్నించే విధానం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. చిన్నప్పుడే పెద్దవాడిలా వ్యవహరిస్తూ ఉంటాడు కర్శన్ దాస్. పదేళ్ల వయసులో తల్లి చనిపోవడంతో, తండ్రి మహారాష్ట్రలోని ముంబై పట్టణంలో, కర్శన్ దాస్ ను అతని మామ గారి ఇంటికి పంపిస్తాడు. అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటాడు కర్శన్ దాస్. కిషోరి అనే తన మరదల్ని కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే కిషోరి ఆ ప్రాంతంలో ఉండే జే జే మహారాజ్ అనే ఆలయ ధర్మకర్తని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది. అతడు చేసే ప్రసంగాలను ఆమెతో పాటు చాలామంది ఆచరిస్తుంటారు. అయితే కిషోరి పై కన్నుపడ్డ మహారాజ్, ఆమెతో ఏకాంతంగా గడపలనుకుంటాడు. ఈ క్రమంలో దైవ సేవ చేయాలంటూ ఆమెను గదిలోకి తీసుకువెళ్లి ఏకంతంగా గడుపుతాడు. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన కర్శన్ దాస్, ఈ విషయం తెలుసుకొని కిషోరిని దూరం పెడతాడు.

ఆ తర్వాత మహారాజ్ మోసగాడు అని గ్రహించిన కిషోరి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కర్శన్ దాస్ చాలా బాధపడతాడు. ఇటువంటి అమ్మాయిలు చాలామంది మహారాజ్ బారిన పడి ఉంటారని గ్రహించి, అతనికి శిక్ష పడేలా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అతనికి వ్యతిరేకంగా ఒక పత్రికను ఏర్పాటు చేసి, అతని గురించి నిజాలు బయటికి చెప్తుంటాడు కర్శన్ దాస్. చివరికి అతని మీద ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాడు. కోర్టులో ఈ వాదన చాలా బలంగా జరుగుతుంది. చివరికి కోర్టులో మహారాజ్ కి శిక్ష పడుతుందా? అతడు తను చేసిన తప్పును ఒప్పుకుంటాడా? కర్శన్ దాస్ ప్రయత్నం ఫలిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మహారాజ్’ (Maharaj) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×