BigTV English

Daaku MahaRaj : యాక్షన్ తప్పా ఏం లేదు… బాబీ కూడా మార్చలేకపోయాడు

Daaku MahaRaj : యాక్షన్ తప్పా ఏం లేదు… బాబీ కూడా మార్చలేకపోయాడు

Daaku MahaRaj : సంక్రాంతి బరిలో ఉంది డాకు మహారాజ్. బందిపోటు మూవీ అని మూవీ టీం చెప్పడంతో సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ విపరీతమైన హైప్ పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి మూవీ పోటీలో ఉన్నా… బాలయ్య ఫ్యాన్స్ ధైర్యంగా ఉన్నారంటే కారణం కూడా అదే. బాలయ్య అలాంటి పాత్రలో నట విశ్వరూపం చూపిస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్‌ను నిరాశపరిచేలా ఉంటుందని ఇన్ సైట్ టాక్ వస్తుంది. తాజాగా డాకు మహారాజ్ కు సంబంధించిన కథ ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతుంది. ఈ కథ ఏంటి..? ఓ వర్గం ఆడియన్స్ ఎందుకు డిస్పాయింట్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం…


బాలయ్యను యాక్షన్ హీరోగా మార్చింది బోయపాటి శ్రీను. బాలయ్య యాక్షన్ చేయడం చూసి బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ ఈలలు వేశారు. కానీ, హై డోస్ యాక్షన్ సీన్స్ ను చూసి కొంత మంది బాలయ్య ఫ్యాన్సే వద్దు అనుకున్నారు. కానీ, డైరెక్టర్లు మాత్రం బాలయ్యను యాక్షన్ చేసే హీరోగానే చూపిస్తున్నారు.

గత ఏడాది భగవంత్ కేసరి అంటూ బాలయ్యతో అనిల్ రావిపూడి వచ్చాడు. అనిల్ రావిపూడి కామెడీతో ఉంటాయని అందరికీ తెలుసు. ఆయన కూడా బాలయ్యతో యాక్షనే చేయించాడు. కొంత వరకు కామెడీ యాంగిల్ ట్రై చేస్తేనే బాలయ్యను కొత్త అవతారంలో చూపించాడని అనిల్‌ని మెచ్చుకున్నారు.


ఇది పక్కన పెడితే… ఇప్పుడు బాలయ్య నుంచి వచ్చే డాకు మహారాజ్ కూడా మొత్తం యాక్షన్ సీన్స్ తో నిండిపోయి ఉందట. సినిమా స్టార్టింగ్ నుంచే యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తాయని సమాచారం. సినిమా మొత్తం మితిమిరిపోయిన యాక్షన్ సీన్స్ ఓ వర్గం ప్రేక్షకులకు మెప్పించడం పక్కన పెట్టి నిరాశ పరుస్తుందని తెలుస్తుంది.

బాబీ గతంలో యాక్షన్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చినా… ఇంతలా ఎప్పుడూ ఇవ్వలేదు. వాల్తేరు వీరయ్య, వెంకీ మామ, జై లవకుశ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ, ఆ యాక్షన్ సీన్స్ వల్ల ఆడియన్స్ ఇరిటేట్ అవ్వలేదు. కానీ, ఇప్పుడు డాకు మహారాజ్ లో మాత్రం ఆ యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్ ఇరిటేట్ అవ్వడం జరుగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

బాబీ చేస్తున్న ఈ యాక్షన్ ప్రయోగం బాలయ్యకు సెట్ అవుతుందా..? సంక్రాంతికి హిట్ కొడుతాడా.? లేదా గేమ్ ఛేంజర్ ముందు డీలా పడిపోతాడా అనేది తెలియాలంటే… జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×