Game Changer..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు దక్కించుకున్నారు దిల్ రాజు (Dilraju). డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలుపెట్టిన దిల్ రాజు, నేడు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్’ పై పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ.. బడా నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు ఇటీవల ఎఫ్ డి సి చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సంక్రాంతి బరిలో దిగిన చిత్రాలలో రెండు చిత్రాలు దిల్ రాజే నిర్మించడం గమనార్హం. అందులో ఒకటి రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్(Game Changer). మరొకటి వెంకటేష్(Venkatesh ) హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki vasthunnaam).ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చినా.. ప్రస్తుతం కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నట్లు మేకర్స్ పోస్టర్స్ రివీల్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉండగా.. సంక్రాంతి సెలవులు కూడా ఉండడంతో ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి మొదటి రోజు రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు (Dilraju) ‘అప్పన్న’ క్యారెక్టర్ గురించి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అప్పన్న క్యారెక్టర్ పై దిల్ రాజు ట్వీట్..
ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. కేవలం సినిమాలోని నాలుగు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు పెట్టామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. “అప్పన్న మనందరి హృదయం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుత ప్రదర్శనకు సాక్షి. అప్పన్నగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లోనే ఇప్పుడు ఉన్నాడు. టికెట్స్ బుక్ చేసుకొని వెంటనే వెళ్లి చూడండి” అంటూ ఎమోషనల్ గా ఒక ట్వీట్ పెట్టాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
గేమ్ ఛేంజర్..
రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara advani), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే రాంచరణ్ మినహా ఏకంగా 17 మంది హీరోలు ఈ సినిమాలో నటించడం గమనార్హం. దీనికి తోడు వీరంతా కూడా ఈ సినిమాలో నటించకంటే ముందు వివిధ సినిమాలలో హీరోలుగా నటించి, ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.
Appanna is all our hearts ❤️🙏🏼
Witness the fantastic performance of Global Star @AlwaysRamCharan as appanna in a theatre near you 🔥
Book your tickets now
🔗 https://t.co/ESks33KFP4#GameChanger#BlockBusterGameChanger In Cinemas Now ✨@shankarshanmugh @advani_kiara… pic.twitter.com/bYXeFAlVoL— Sri Venkateswara Creations (@SVC_official) January 12, 2025