BigTV English

Raw Milk For Skin: పచ్చిపాలలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మెరిసే చర్మం

Raw Milk For Skin: పచ్చిపాలలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మెరిసే చర్మం

Raw Milk For Skin: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందం కోసం వేలల్లో ఖర్చు పెట్టే వారు కూడా లేకపోలేదు. కొంతమంది క్లీన్ అప్ కోసం గంటల తరబడి పార్లర్‌ల చుట్టూ తిరుగుతారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. వీటిలో ముఖ్యమైనది పచ్చి పాలు. పచ్చి పాలు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరుచుగా వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. పాలు ముఖానికి వాడటం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతే కాకుండా చర్మం లోతుల నుండి శుభ్రపడుతుంది.


పాలు చర్మంపై ఉన్న మచ్చలను తొలగిస్తాయి. అంతూ కాకుండా చర్మం యొక్క రంగును కూడా మెరుగుపరుస్తాయి. చర్మాన్ని హైడేటెడ్ గా ఉంచడంలో కూడా పాలు చాలా బాగా ఉపయోగపడతాయి.అంతే కాకుండా స్కిన్ పొడి బారకుండా కాపాడతాయి. నల్లమచ్చలను తొలగించడంలో కూడా పాలు ప్రభావవతంగా పనిచేస్తాయి. చర్మంపై యాంటీ ఏజింగ్ సంకేతాలను తగ్గించడంతో పాటు ముడతలు, ఫఐన్ లైన్లను తగ్గిస్తుంది. పచ్చి పాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పచ్చిపాలలో కొన్ని పదార్థాలను తయారు చేసి వాడటం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం పచ్చి పాలను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోయింగ్ స్కిన్ కోసం ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
2 టేబుల్ స్సూన్ల పచ్చి పాలలో, 1 టీ స్పూన్ కొబ్బరినూనె , 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి . తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా దీనిని వాడటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.


మచ్చల కోసం ఫేస్ ప్యాక్:

చలికాలంలో పొడిబారిన చర్మానికి ఉత్తమ ఎంపిక ఓట్స్ ఫేస్ ప్యాక్. ఓట్స్ పేస్ట్ లో 1 టీ స్పూన్ పచ్చి పాలు వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ పేస్టును ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి గ్లో అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తేమగా మారుస్తుంది.

Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. ఇలా చేయండి !

మొటిమల కోసం ఫేస్ ప్యాక్:

2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టితో పాటు, కాస్త పసుపు వేసి మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్‌తో పాటు ముడతలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. పాలలో ఉండే పోషకాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి. మొటిమలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×