BigTV English

Dangal Actress Zaira Wasim: ‘దంగల్’ మూవీ నటి జైరా ఇంట తీవ్ర విషాదం.. స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయండి..

Dangal Actress Zaira Wasim: ‘దంగల్’ మూవీ నటి జైరా ఇంట తీవ్ర విషాదం.. స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయండి..

Dangal actress Zaira Wasim father dies: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘దంగల్’. ఈ మూవీ అప్పట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇందులో నటించిన జైరా వసీం తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాజాగా ఈ నటి ఇంట తీవ్ర విషాదం జరిగింది. నటి జైరా తండ్రి జాహిద్ వాసిమ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జైరా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని తమ అభిమానులకు ప్రార్థనలు చేయమని కోరింది. ఈ విషయాన్ని జైరా తన సోషల్ మీడియా స్టోరీ ద్వారా తెలియజేసింది. ‘‘నా తండ్రి జాహిద్ వాసిమ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మీ ప్రార్థనలలో ఆయనను స్మరించుకోవాలి. ఆయన క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థించాలని నేను కోరుతున్నాను. అల్లా వారి పాపాలను క్షమించమరి ప్రార్థించండి’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక జైరా వసీం సినిమాల విషయానికొస్తే.. ఆమె దంగల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ అవార్డును అందుకుంది. ఇందులో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌తోనే మరొక సినిమా చేసింది. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే 2019లో ‘ది స్కై ఈజ్ పింక్’ మూవీలో నటించింది. ఇందులో జైరా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.


Also Read: బ్రేకింగ్.. ‘దంగల్‌’ మూవీ నటి సుహానీ మృతి

అయితే ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రమే జైరా చివరి చిత్రం. ఈ మూవీ తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత 2020లో తన కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేసినందున సోషల్ మీడియా నుండి కూడా తన ఫొటోలను రిమూవ్ చేయమని అభిమానులను కోరింది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×