BigTV English
Advertisement

Darling: నెల తిరక్కుండానే ఓటీటీలోకి డార్లింగ్.. ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Darling: నెల తిరక్కుండానే ఓటీటీలోకి డార్లింగ్.. ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Darling movie OTT release date(Latest movies in tollywood): ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డార్లింగ్. అనన్య నాగళ్ళ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించింది. డార్లింగ్ టైటిల్ ను రివీల్ చేయడానికి.. ప్రియదర్శి, నభా సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో అందరికి తెల్సిందే. ఇక దీంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.


ఇక పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. కామెడీ ఎంటర్ టైనర్ గా డార్లింగ్ ఉంటుందని అనుకున్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ జూలై 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజునే మిక్స్డ్ టాక్ అందుకోవడంతో అంతగా కలక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ బాటపట్టింది.

నెల కూడా అవ్వకముందే డార్లింగ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 13 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.


ఇక డార్లింగ్ కథ విషయానికొస్తే.. రాఘవ్(ప్రియదర్శి) చిన్నతనం నుంచి పెళ్లి అంటే ఎన్నో ఆశలు పెట్టుకొని పెరుగుతాడు. ఇక చివరగా.. అనన్యతో అతడి పెళ్లి సెట్ అవుతోంది. ఎన్నో ఊహలతో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న రాఘవ్ కు అనన్య షాక్ ఇస్తుంది. పెళ్లి రోజే ప్రియుడితో పారిపోతుంది.

ఇక దీంతో రాఘవ్ చనిపోవాలని చూస్తాడు. ఆ సమయంలోనే రాఘవ్ కు ఆనంది(నభా నటేష్) పరిచయమవుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి తరువాత ఆనంది ఎలా మారింది.. ? ఎందుకు మారింది.. ? అసలు ఆనందికి ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×