BigTV English

Paris Olympics 2024: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

Paris Olympics 2024: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

Men’s Hockey India team Beat Australia in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. శుక్రవారం పూల్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుపై 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టుపై భారత్ గెలవడం గత 52 ఏళ్లలో గెలుపొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఈ మ్యాచ్ గెలుపులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. మొదట మ్యాచ్ ప్రారంభమైన 12వ నిమిషంలో అభిషేక్ గోల్ చేయడంతో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో గగోల్ చేయడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో ముందంజ వేసింది.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా 25 వ నిమిషంలో ఖాతా తెరిచింది. క్రెయిగ్ థామస్ గోల్ చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అనంతరం మూడో క్వార్టర్ లో హర్మన్ ప్రతీత్ సింగ్ 32వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ చేయడంతో భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నాలుగో క్వార్టర్ లో ఆస్ట్రేలియా మరో గోల్ చేశాడు. దీంతో 3-2గా నమోదైంది.


Also Read: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు

అంతకుముందు 1972 జర్మనీ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా హాకీ జట్టును భారత్ ఓడించింది. మళ్లీ సరిగ్గా 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. కాగా, ఇప్పటికే ఇరు జట్లు క్వార్టర్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్‌లో భారత్..జర్మనీ లేదా గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×