BigTV English

Update on Dasara 2: బాంచత్.. ధరణి గాడు మళ్లొస్తుండు..! పువ్వకొట్టండి!

Update on Dasara 2: బాంచత్.. ధరణి గాడు మళ్లొస్తుండు..! పువ్వకొట్టండి!

Update on Hero Nani’s Dasara Movie Sequel: ఈ మధ్యకాలంలో సినిమా.. చిన్నదా.. పెద్దదా..? అనేది చూడడం లేదు. కచ్చితంగా దానికి సీక్వెల్ ఉంటుంది.  ఒక సినిమా సక్సెస్ అయినా.. ప్లాప్ అయినా కూడా సీక్వెల్ తో మేకర్స్ ముందుకు వస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రేక్షకుల మీద రివెంజా అంటే.. నిజమే అంటున్నారు  విమర్శకులు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే ఆనందమే అని చెప్పాలి. అసలు ఇప్పుడు ఏ సీక్వెల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనేగా డౌట్. దసరా.


న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందించింది. నాని ఊర మాస్ లుక్, రా అండ్ రస్టిక్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని డైరెక్టర్ ఎప్పుడో ప్రకటించాడు. తాజాగా ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని.. సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే.. నాని, శ్రీకాంత్.. దసరా 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.  ఈ ఏడాదిలో మధ్యలోనే దసరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుకానున్నాయని సమాచారం.

Also Read: Prithviraj Sukumaran: బాలకృష్ణతో బ్రో డాడీ.. పక్కా మలయాళ సినిమాలా తీస్తా..?


ఇక నాని దసరా2  తో మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ధరణిగా నాని, వెన్నెల గా కీర్తి సురేష్ జంట నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  స్నేహితుడు ను చంపినా వాడిని,  భార్యపై కన్నేసినవాడిని చంపి జైలుకు వెళ్లివచ్చిన ధరణి.. తన ఊరిలో సిల్క్ బార్ ఇంకా మూసివేయకపోవడంతో.. దాన్ని తగలపెట్టడంతో దసరా సినిమా ముగుస్తుంది. ఇక దీనికి కంటిన్యూగా దసరా 2 ఉండబోతుందా.. ? లేక శ్రీకాంత్ కొత్త కథను రాసుకున్నాడా.. ? అని తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్  విషయం తెలియడంతో వారు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సీక్వెల్ తో శ్రీకాంత్- నాని ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×