EPAPER

Chandrababu @ Kuppam: వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..!

Chandrababu @ Kuppam: వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..!
Chandrababu
Chandrababu
Chandrababu Kuppam Tour: కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని సీఎం వైఎస్ జగన్ యువతను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రం డీఎస్సీ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్‌-1 ఉద్యోగాలను నచ్చినవారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు.
ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సర్వే నంబర్స్ మార్చి ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గం కప్పుంలోనూ తనకు బెదిరింపులు తప్పటం లేదన్నారు. ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు.
ఏపీలో ఖనిజ సంపదను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మండిపడ్డారు. ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు.
కేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. టెండర్స్ లోనూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వారి జీవితాలు మారుస్తామన్నారు.


Related News

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Tirumala Darshan : తిరుమలలో సామాన్యులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటా…

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Minister lokesh met Google cloud CEO: అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Janasena In TTD: టీటీడీ బోర్డులో జనసేన, బీజేపీ.. ముగ్గురు చొప్పున ఛాన్స్

TTD Sarva darshanam: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మీరే వడ్డించే అవకాశం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

×